Leading News Portal in Telugu

Minister Narayana said that strict action will be taken if machines are dug in sand reaches.


  • ఇసుక రీచ్‌ల్లో యంత్రాలతో తవ్వితే కఠిన చర్యలు- మంత్రి నారాయణ

  • ఇసుక రీచ్‌ల్లో సీసీ కెమెరాలను పెడతాం- మంత్రి నారాయణ

  • గతంలో ట్రాక్టర్‌ ఇసుక రూ. 4వేలుంటే.. ఇప్పుడు రూ.1500లకు తగ్గింది- నారాయణ

  • మున్ముందు ఇసుక ధర మరింత తగ్గుతుంది- మంత్రి

  • నిర్మాణ రంగం అభివృద్ధి చెందాలనేది సీఎం లక్ష్యం- మంత్రి నారాయణ.
Minister Narayana: ఇసుక రీచ్‌ల్లో యంత్రాలతో తవ్వితే కఠిన చర్యలు..

నెల్లూరు నగర శివారులలోని పెన్నా నదిలో ఇసుక రీచ్‌లను అధికారులతో కలిసి మంత్రి డా. పొంగూరు నారాయణ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇసుక రీచ్‌ల్లో యంత్రాలతో తవ్వినా, అక్రమ రవాణా చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు.. ఇసుక రీచ్‌ల్లో సీసీ కెమెరాలను పెడతామని అన్నారు. ప్రజలందరికీ సులభంగా ఇసుక లభించాలనే ఉద్దేశంతోనే ఉచిత ఇసుక పాలసీని ప్రభుత్వం తీసుకు వచ్చిందని మంత్రి చెప్పారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ఎవరైనా తీసుకుపోవచ్చని మంత్రి వెల్లడించారు.

రీచ్‌లలోకి ట్రాక్టర్లను అనుమతించిన తర్వాత ఇసుక లభ్యత పెరిగింది.. ధరలు కూడా గణనీయంగా దిగివచ్చాయని మంత్రి నారాయణ అన్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ.4 వేలు ఉంటే ఇప్పుడు రూ.15 వందలకు తగ్గింది.. ఇది మరింత తగ్గుతుందన్నారు. నిర్మాణ రంగం అభివృద్ధి చెందాలనేదే ముఖ్యమంత్రి లక్ష్యమని చెప్పారు. ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఈ ఉచిత పాలసీని తీసుకు వచ్చామని మంత్రి నారాయణ తెలిపారు.