Leading News Portal in Telugu

first look poster of raghava lawrence new movie to be out on this date


RL25 : రమేష్ వర్మ డైరెక్షన్లో రాఘవ లారెన్స్ కొత్త సినిమా.. ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది

RL25 : కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ మొదలు పెట్టి హీరోగా తన సత్తా నిరూపించుకుని డైరెక్టర్ గా మారారు రాఘవ లారెన్స్. ఆయన డైరెక్షన్లో వచ్చిన సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేస్తూ వాళ్లనే డైరెక్షన్ చేసే రేంజ్ కు ఎదిగారు. అంతే కాకుండా తనకు సినిమాల ద్వారా వచ్చే సంపాదనలో కొంతమేర వికలాంగుల శ్రేయస్సు కోసం ఉపయోగిస్తున్నారు. ఇక ఆయన నటించే సినిమాలకు తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన ప్రస్తుతం తన కెరీర్‌లోని 25వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇప్పటికే శరవేగంగా ఈ సినిమా షూటింగు జరుపుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని అక్టోబర్ 29అంటే నేడు ఉదయం 10.30 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. బిగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో లారెన్స్ సరికొత్త గత సినిమాల లాగా కాకుండా కొత్త గెటప్‌తో కనిపిస్తాడని.. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ఇక లారెన్స్ గతేడాది చంద్రముఖి 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.