Leading News Portal in Telugu

Suspicious death of assistant bank manager in Tirupati


  • తిరుపతిలో బ్యాంక్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ అనుమానాస్పద మృతి..

  • కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు..
Tirupati Crime: అసిస్టెంట్‌ బ్యాంక్‌ మేనేజర్‌ అనుమానాస్పద మృతి

Tirupati Crime: తిరుపతిలో ఓ బ్యాంక్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.. తిరుపతి రూరల్ లో ఓ ప్రైవేట్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్న వెంకటప్రసాద్‌.. స్థానికంగా శ్రీపురం కాలనీలో నివాసం ఉంటున్నారు.. 2012లో తిరుపతికి చెందిన మాధురిని ప్రేమించి.. పెళ్లి చేసుకున్నాడు వెంకట ప్రసాద్ .. అయితే, సోమవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు వెంకట ప్రసాద్.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోవడం.. ఎంతకీ తిరిగి రాకపోవడం.. కనీసం సమాచారం కూడా లేకపోవడంతో.. చివరకు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు.. అయితే, తనపల్లి దగ్గర ఓ ప్రైవేట్ లాడ్జిలో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా.. లాడ్జిలో ఉరికి వేలాడుతూ మృతదేహం కనిపించింది.. కానీ, వెంకట ప్రసాద్‌ మృతదేహంపై రక్తపు మరకలను గుర్తించారు పోలీసులు.. దీంతో.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. అయితే, కుటుంబ వ్యవహారాలతో వెంకటప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్నాడా? ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా? లేదా? ఎవరైనా హత్య చేశారా? అనే అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు..