Leading News Portal in Telugu

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు భారీ షాక్! | big shock to washingtonpost before america presidential election| 8%| subscibers| withdraw| several| columists


posted on Oct 29, 2024 12:40PM

అమెరికా ఎన్నికల వేళ ఆ దేశంలోని ప్రముఖ వార్తా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ సంక్షోభంలో కూరుకుపోయింది. సంక్షోభం అంటే ఆర్థిక సంక్షోభం కాదు. కాలమిస్టులు వాషింగ్టన్ పోస్ట్ కు రాజీనామా చేశారు. అంతే కాదు పత్రిక సబ్ స్క్రైబర్లలో కనీసం ఎనిమిది శాతం మంది విత్ డ్రా అయ్యారు. ప్రింట్  అండ్ డిజిటల్ మీడియాకు సంబంధించి ఈ సబ్ స్క్రిప్షన్ ల రద్దు ఉంది. దాదాపు రెండు లక్షల మంది వాషింగ్ టన్ పోస్ట్ చదివే ప్రశక్తే లేదని ప్రకటించారు. 

ఇందుకు కారణమేమిటంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో వాషింగ్టన్ పోస్ట్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కు వ్యతిరేక స్టాండ్ తీసుకోవడమే కారణం. వాషింగ్టన్ పోస్ట్ ఈ నిర్ణయం తీసుకున్న 24 గంటల వ్యవధిలో ఎనిమిది శాతం మంది పత్రిక సబ్ స్క్రైబర్లు  విత్ డ్రా అయ్యారు.  అలాగే ప‌లువురు కాలమిస్టులు రాజీనామా చేశారు. అయితే వీటివేటినీ వాషింగ్టన్ పోస్టు ధృవీకరించలేదు.

అమెరికా అధ్యక్ష పదవి కోసం డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మధ్య హోరోహోరీ పోరు సాగుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే వాషింగ్టన్ పోస్టు ఒక సైడ్ తీసుకోవడాన్ని కాలమిస్టులు, సబ్ స్క్రైబర్లు వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ ప్రభావం వాషింగ్ టన్ పోస్టు క్రెడిబులిటీపై ఏ మేరకు ప్రభావం చూపిందన్నది కొద్ది రోజులలో తేలుతుంది. అలాగే డోనాల్డ్ ట్రంప్ కు కమలా షారీస్ ఎంత గట్టి పోటీ ఇస్తున్నారన్నదది కూడా తేటతోల్లం అవుతుంది.