posted on Oct 29, 2024 2:11PM
హైదరాబాద్ లో 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యురిటీలో మార్పులు చేర్పులు చేశారు. ఇంతకుమునుపు బెటాలియన్ పోలీసులు మాత్రమే రేవంత్ రెడ్డి భధ్రతను చూసుకునే వారు. ముఖ్యమంత్రి ఇంటి వద్ద కూడా వీళ్లే సెక్యురిటీ చూసుకున్నారు. సడెన్ ముఖ్యమంత్రి సెక్యురిటీ వింగ్ మారిపోయింది వారి స్థానంలో ఆర్మ్ డ్ రిజర్వ్ సిబ్బంది వచ్చేసింది. ముఖ్యమంత్రి ఇంటికి మూడు వైపుల 22 మంది టీజీ ఎస్పీ సిబ్బంది ఉండేవారు. వారి స్థానంలో ఆర్మ్ డ్ రిజర్వ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. జన్వాడ ఫాం హౌజ్ పై దాడి తర్వాత రేవంత్ రెడ్డి సెక్యురిటీ అప్రమత్తమైంది. కెటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశముందని వార్తలు వెలువడుతున్నాయి. ఫార్ములా ఈ రేస్ కుంభకోణంలో కెటీఆర్ బామ్మర్ది పాత్ర ఉన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలు సేకరించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలు సేకరించింది. తుది దశలో ఉన్న దర్యాప్తు అసలు పాత్రధారులు, సూత్రధారులు ఎవరో వెల్లడించనుంది. కెసీఆర్, హరీష్ రావు అరెస్ట్ అయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సెక్యురిటీలో మార్పులు చేర్పులు చేశారు.