Leading News Portal in Telugu

The whole world is looking towards Andhra: Minister Anagani Satya Prasad


  • ప్రతి పేద వాడికి అందుబాటులో ఉండేలా ఈ ప్రభుత్వం చర్యలు..

  • రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..

  • ఏపీలో డ్రగ్స్ లేకుండా చేస్తాం: మంత్రి అనగాని సత్య ప్రసాద్
Minister Anagani: ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోంది..

Minister Anagani: తిరుపతికి రావడం ఎంతో సంతోషంగా ఉంది అని మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. ఇక, 140 రోజుల్లో ముఖ్యమంత్రి ఐదు ఫైళ్లపై సంతకం చేశారు.. ప్రతి పేద వాడికి ఈ ప్రభుత్వం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే, ప్రపంచం మొత్తం ఆంధ్ర వైపు చూస్తోంది అని వ్యాఖ్యానించారు. రాబోయే 2, 3 సంవత్సరాల్లో ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని అభివృధ్ది చేస్తాం.. అభివృధ్ది,సంక్షేమం రెండు కళ్ళ లాంటివని ఆయన అన్నారు. బీజేపీ, జనసేనతో కలిపి కూటమి ప్రభుత్వం అభివృధ్ది చేస్తోంది.. తిరుపతి ఇంకా అభివృధ్ది చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం.. పులికాట్ సరస్సు అభివృధ్ది చేయడానికి కలెక్టర్ ప్రణాళికలు రూపొందించారు.. తిరుపతిలో భూ కబ్జాలపై చర్యలు తీసుకుంటాం.. రిజిస్ట్రేషన్ తదితర అంశాలను పరిశీలించి 15 రోజుల్లో సీఎం వివరాలు చెబుతారు.. గంజాయి, డ్రగ్స్ కు బానిసైన వారిలో చైతన్యం తీసుకోవడానికి ఎస్పీ చర్యలు తీసుకుంటున్నారు అని మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు.

ఇక, రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేస్తామని మంత్రి అనగాని తెలిపారు. ఇసుక పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకున్నారని చెప్పారు. దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి.. విద్యుత్ ధరల పెంపు విషయంలో ప్రతిపక్షాలు అనవసరపు ప్రచారం చేస్తున్నారు.. 2019 నుంచి 24 వరకు విద్యుత్ 9 సార్లు పెంచారు.. పేదవారికి ఆత్మ గౌరవం కల్పించే విధంగా గ్రామ పంచాయతీలో అభివృధ్ది చేస్తున్నాం.. జనవరి నాటికి పల్లెలో గుంతల రోడ్లు లేకుండా రోడ్లన్నీ పూర్తి చేస్తాం.. తిరుపతి అభివృద్ధికి తోడ్పడి ఉంటామని అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు.