Leading News Portal in Telugu

కేరళలో భారీ అగ్ని ప్రమాదం, 150 మందికి గాయాలు, 8 మంది పరిస్థితి ఆందోళనకరం  | Huge fire accident in Kerala| 150 people injured


posted on Oct 29, 2024 10:45AM

కేరళలో టెంపుల్ ఫెస్టివల్ కోసం నిల్వ ఉంచిన బాణాసంచా పేలి 150 మంది గాయాలపాలయ్యారు ఎనిమిది మంది పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. కేరళలోని కాసర్ గోడ్ లో సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదం వల్ల భారీ మంటలు వ్యాపించాయి. నీలేశ్వర్ సమీపంలోని ఓ ఆలయంలో ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను కాసర్ గోడ్, మంగళూరులోని  ఆస్పత్రులకు తరలించారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, జిల్లా యంత్రాంగం అంతా ప్రమాద స్థలికి చేరుకుని అగ్ని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. క్షతగాత్రులకు సహయకచర్యలు చేపట్టారు. బుధవారం నరకచతుర్ధషి, గురువారం దీపావలి సంబరాలు ఘనంగా జరుపుంటున్న నేపథ్యంలో బాణాసంచా పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో విషాదచాయలు అలముకున్నాయి.