Leading News Portal in Telugu

Minister Nara Lokesh meet Adobe CEO Shantanu Narayan and asked them to invest in AP


  • అడోబ్ సీఈవోతో మంత్రి నారా లోకేష్ భేటీ..
    ఏపీలో అడోబ్ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి..

  • స్మార్ట్ గవర్నెన్స్.. ఏఐ-డ్రైవెన్ సొల్యూషన్స్‌లో భాగస్వామ్యం వహించండి..

  • యువతలో డిజిటల్ నైపుణ్యాల మెరుగుదలకు సహకారం అందించండి..
Lokesh meet Adobe CEO: అడోబ్ సీఈవోతో మంత్రి లోకేష్ భేటీ.. ఏపీలో అడోబ్ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి..

Nara Lokesh meet Adobe CEO: ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. అమెరికా టూర్ అవిశ్రాంతంగా కొనసాగుతోంది. తాజాగా, శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ సీఈవో శంతను నారాయణ్ తో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ముందుకు సాగుతోంది, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులకు అన్నివిధాల అనుకూలమైన ప్రాంతమని వివరించారు.. ఇన్నోవేషన్ అండ్ గ్రోత్ విజన్ తో మీరు చేస్తున్న కృషి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విజన్‌తో సరిపోతుంది. డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌ల ద్వారా సృజనాత్మక, వ్యాపార సాధనాల్లో అడోబ్ సేవలు ప్రశంసనీయం. ఏపీలో ఈ-గవర్నెన్స్‌ని సమగ్రపర్చడం, గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చడానికి మీవంతు సహకారం అందించండి. ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్నాం. డిజిటల్ విద్యా ప్లాట్‌ఫారమ్‌లలో ఏఐ ఆధారిత పరిష్కారాలను ఏకీకృతం చేయడంలో మీ భాగస్వామ్యాన్ని కోరారు..

ఇక, ఏపీలో అడోబ్ ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటు చేయండి అని కోరారు మంత్రి లోకేష్.. ఆంధ్రప్రదేశ్ లో యువతను డిజిటల్ నైపుణ్యాలతో శక్తివంతం చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. డిజిటల్ ఎడ్యుకేషన్ ను మెరుగుపర్చడంలో భాగంగా డిజిటల్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్‌లను రాష్ట్రానికి తీసుకురావడానికి అడోబ్ తరపున సహకారం అందించండి. డాక్యుమెంట్ ప్రొడక్టివిటీ, ఏఐ పవర్డ్ టూల్స్‌లో అడోబ్ నైపుణ్యం మాకు ఎంతగానో ఉపకరిస్తుంది. డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, పబ్లిక్ సర్వీస్‌లను క్రమబద్ధీకరించడం, ప్రభుత్వ ప్రక్రియలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి, స్మార్ట్ గవర్నెన్స్, ఎఐ-డ్రైవెన్ సొల్యూషన్స్‌ అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేయండి. ప్రభుత్వం, పరిశ్రమల వినియోగానికి సంబంధించి క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, ప్రభుత్వ కార్యకలాపాలు, పౌరసేవల్లో క్లౌడ్ ఇంటిగ్రేషన్‌ కు అడోబ్ భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించండి. ప్రభుత్వ సేవలు, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌ల్లో అడోబ్ ఏఐ ఆధారిత సేవలు, సృజనాత్మకత, డిజిటల్ అనుభవం ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడతాయి. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, స్టార్టప్‌లకు అడోబ్ యొక్క సృజనాత్మక సాధనాలు ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధికి దోహదపడతాయి, ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని లోకేష్ కోరారు.

అయితే, మంత్రి నారా లోకేష్‌ చేసిన ప్రతిపాదనలపై శంతన్ నారాయణ్ స్పందిస్తూ… కంపెనీలోని సహచరులతో చర్చించి ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అడోబ్ కంపెనీ ప్రస్తుతం డిజిటల్ మీడియా, క్లౌడ్-ఆధారిత సేవల్లో అగ్రగామిగా ఉంది. ఫోటోషాప్, అక్రోబాట్, ఇల్లస్ట్రేటర్ వంటి సాధనాలను మరింత అందుబాటులోకి తెచ్చాం. సృజనాత్మకత, డాక్యుమెంట్ ఉత్పాదకత, ఏఐ-పవర్డ్ ఇన్నోవేషన్స్ రంగంలో ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ వెర్షన్స్ ను అందుబాటులోకి తెస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్ నాటికి తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రూ.17.95 లక్షలకోట్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉందని వివరించారు శంతన్ నారాయణ్..