Leading News Portal in Telugu

Kiran Abbavaram : ట్రోలర్స్ కు ఇచ్చి పడేసిన కిరణ్ అబ్బవరం..


రాజావారు రాణిగారు` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం `ఎస్‌ఆర్ కళ్యాణమండపం`తో సూపర్ హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో ఆడియెన్స్ ను పలకరించిన కిరణ్ కు ప్లాప్స్ ఎదురయ్యాయి.దీంతో ఏడాది గ్యాప్ తీసుకుని ‘క’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మంగళవారం రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. క స్టేజ్ పై తనపై విమర్శలు చేస్తున్న వారికీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు కిరణ్ అబ్బవరం.

కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ”  అసలు మీకు కిరణ్ అబ్బవరం తో  ప్రాబ్లమ్ ఏంటి, ఎస్‌ఆర్‌కళ్యాణ మండపం` సమయంలో ఎంతో మంది తనని అభిమానించారు. కానీ గత సినిమాలు ఫ్లాప్ అవడంతో కొందరు తనను టార్గెట్‌ చేస్తున్నారు, గత ఏడాదిగా ట్రోల్ల్స్ ఎక్కువయ్యాయి, తన లుక్‌పై, సినిమాలపై దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. కిరణ్‌ అబ్బవరంతో సమస్య ఏంటి?   అసలు నేను సినిమాలు చేయకూడదా? అంతేకాదు మీకు ఓ విషయం చెప్పాలి.. చెక్ పోస్ట్ దగ్గర ఒక కంపెనీ ఉంటుంది. వాళ్ళు తీసిన సినిమాలో నాపై ట్రోల్‌ చేసారు. అసలు నా మీదా ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏంటి,  నాతో మీకు అసలు ఏంటి ప్రాబ్లెమ్. ఆ ట్రోలింగ్ వల్ల  ఫ్యాన్స్ నాకు కాల్ చేసి, ఏంటీ బ్రో మీ మీద మరీ ఇలా చేస్తున్నారని చెప్పారని, అది ఎంతో బాధ కలిగించింది. నేను ఇప్పటివరకు  ఎనిమిది సినిమాల్లో నాలుగు డీసెంట్‌ హిట్లు పడ్డాయి, అంటే నేను ఫెయిల్యూర్ యాక్టర్ ని కాదు. హిట్స్ ప్లాప్స్ అందరి లైఫ్‌లో కామన్‌, అసలు  నాలాంటోడు సినిమాలు తీసి థియేటర్ వరకు రావడమే సక్సెస్‌” అని అన్నారు.