Leading News Portal in Telugu

NishadYusuf Editor of Kanguva, Thallumalla and Suriya45 passed away.


  • కంగువ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ మృతి
  • మళయాల బ్లాక్ బస్టర్ సినిమాలకు ఎడిటింగ్ చేసిన యూసుఫ్
  • సంతాపం ప్రకటించిన ప్రముఖులు
Shocking : కంగువ ఎడిటర్ హఠాన్మరణం..

సూర్య హీరోగా నటిసున్న సినిమా కంగువ. శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నవంబరు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ ను భారీ ఎత్తున నిర్వహిస్తోంది. ఇటీవల తెలుగులోను ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న కంగువ యూనిట్ షాకింగ్ తగిలింది. ఈ సినిమాకు ఎడిటర్ గా పని చేసిన నిషాద్ యూసుఫ్ మృతి చెందారు.

ఇటీవల చెన్నై లో జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమంలో పాల్గిన్నారు యూసుఫ్. ఈవెంట్ లో అందరితో ఎంతో సరదాగా గడిపారు. అలాగే కంగువ పాన్ ఇండియా ప్రమోషన్స్ లోను యూసుఫ్ పాల్గొన్నారు. కానీ నేడు ఉదయం కేరళలోని కొచ్చి లో ఆయన సొంత ఫ్లాట్ లో మృతి చెంది విగత జీవిగా పడిఉన్నారు. వెంటనే హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మళయాలంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలకు నిషాద్ ఎడిటర్ గా పని చేసాడు. తోవినో థామస్ నటించిన  ‘తుళ్లుమల’ సినిమాకు ఎడిటర్ గా  పలు అవార్డ్స్ అందుకున్నారు నిషాద్. కంగువ తో పాన్ ఇండియా  స్థాయిలో మరింత గుర్తిపు వస్తుందని యూనిట్ భావించింది. అంతలోనే నిషాద్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఈ వార్తతో కంగువ యూనిట్ ఒక్కసారిగా  షాక్ కు గురైంది. సూర్య, RJ బాలాజీ కాంబోలో వస్తున్న సినిమాకు కూడా నిషాద్ ను ఎడిటర్ గా వర్క్ చేస్తున్నాడు. నిషాద్ యూసుఫ్ అకాల మరణానికి గల కారణాల ఇంకా తెలియరాలేదు. నిషాద్ మృతికి కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ తో పాటు కంగువ యూనిట్ సంతాపం ప్రకటించారు.