- షాపూర్ నగర్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం
- బైక్‌ను అతివేగంతో ఢీకొన్న బస్సు
- ద్విచక్రవాహనదారుడు మృతి

Road Accident: హైదరాబాద్‌లోని షాపూర్ నగర్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వాహనదారుడిని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రాథమిక దర్యాప్తులో మృతుడు రాంకీ సంస్థలో పనిచేసే హరికృష్ణగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఘటనాస్థలిలో ప్రమాదానికి కారణమైన బస్సుపై వాహనదారులు దాడి చేసి అద్దాలను పగలగొట్టారు. ఉదయం రోడ్లపై పని చేస్తున్న మున్సిపల్ కార్మికులు, స్థానికులు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.