Leading News Portal in Telugu

Huge explosion in kitchen of Anna canteen in Kadapa


  • కడపలో అన్నా క్యాంటీన్ వంటశాలలో భారీ పేలుడు..

  • మార్కెట్ యార్డు సమీపంలోని అన్నా క్యాంటీన్ ఆహార తయారీశాల..

  • తెల్లవారుజామున 3 గంటల సమయంలో గ్యాస్ లీక్‌ కావడంతో ప్రమాదం..
Blast in Anna canteen: అన్నా క్యాంటీన్ వంటశాలలో భారీ పేలుడు

Blast in Anna canteen: కడపలో అన్నా క్యాంటీన్ వంటశాలలో భారీ పేలుడు సంభవించింది… కడప మార్కెట్ యార్డు సమీపంలోని అన్నా క్యాంటీన్ ఆహార తయారీశాల వద్ద ఉన్న వంటశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గ్యాస్ లీక్‌ కావడంతో ప్రమాదం జరిగింది.. గ్యాస్ లీక్ కావడంతో భారీ పేలుడు జరిగింది.. ఇక, పేలుడు ధాటికి వంటశాల షెడ్ ధ్వంసం అయ్యింది.. పేలుడు ధాటికి వంటశాలలోని బాయిలర్ 200 అడుగుల మేరా ఎగిరిపడినట్టుగా చెబుతున్నారు.. మరోవైపు.. చెల్లాచెదురుగా పడిపోయాయి వస్తువులు.. అయితే, రాత్రి కావడం.. వంట శాలలో ఎవరూ లేకపోవడంత.. సిబ్బంది బాయిలర్ వద్ద లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.. అయితే, భారీ పేలుడుతో స్థానికులు.. కార్మికులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు.. మరోవైపు.. ఎవరి కంట పడకుండా ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది..