Leading News Portal in Telugu

Kidambi Srikanth Marriage: Indian Badminton Player Kidambi Srikanth Meets CM Revanth Reddy


  • సీఎం రేవంత్‌ను కలిసిన కిదాంబి శ్రీకాంత్
  • సీఎంకు శుభలేఖ అందించిన శ్రీకాంత్
  • సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయితో వివాహం
Kidambi Srikanth Marriage: పెళ్లికి రండి.. సీఎం రేవంత్‌ను ఆహ్వానించిన శ్రీకాంత్!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ కలిశారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీకాంత్.. తన వివాహానికి హాజరుకావాలని ఆహ్వానించారు. శ్రీకాంత్, ఆయనకు కాబోయే భార్య శ్రావ్య వర్మలు సీఎంకు శుఖలేఖను అందజేశారు. ఇందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ 2018లో పద్మశ్రీ అందుకున్నాడు. 2015లో అర్జున అవార్డు సైతం అతడికి దక్కింది. కెరీర్ ఆరంభంలో అనూహ్య విజయాలతో దూసుకెళ్లిన శ్రీకాంత్.. 2014 చైనా ఓపెన్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. 2017లో ఇండొనేసియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ఇలా ఒకే ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించాడు. ఆ తర్వాతి ఏడాది ప్రపంచ నంబర్ వన్ అయ్యాడు. దీంతో లెజెండరీ స్టేటస్ వచ్చింది. అయితే గాయాలు అతడి కెరీర్‌కు బ్రేక్ వేశాయి. కోలుకుని పునరాగమనం చేసినా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 2021లో తిరిగి ఫామ్ అందుకుని ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు. గాడిన పడ్డాడని అనుకున్నా.. ఆ తర్వాత మళ్లీ పతనం చవిచూశాడు.

ఇక శ్రావ్య వర్మ టాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్. ఆమె నిర్మాత కూడా. ఇక శ్రావ్య వర్మ మరెవరో కాదు టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు. ఆమె నిర్మాత మాత్రమే కాదు.. ఫ్యాషన్ డిజైనర్ కూడా. నాగార్జున, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్ లాంటి హీరోలకు పర్సనల్ స్టైలిస్ట్‌గా చేశారు. కీర్తి సురేష్ నటించిన ‘గుడ్ లక్ సఖి’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.