Leading News Portal in Telugu

IPhone 17 will be manufactured in India?


  • చైనాకు భారీ షాక్
  • ఐఫోన్ 17ను భారత్‌లో తయారు చేయనున్న ఆపిల్
  • గత కొన్నేళ్లుగా పలు ఐఫోన్‌ మోడళ్లు భారత్‌లో తయారి
  • ఇక్కడ నుంచే విదేశాలకు ఎగుమతి చేస్తున్న కంపెనీ
iPhone 17: చైనాకు మరో షాక్.. భారత్‌లోనే ఐఫోన్ 17 తయారీ?

ఆపిల్ ఇప్పుడు తన ఐఫోన్17 యొక్క బేస్ మోడల్‌పై పని చేయడం ప్రారంభించినట్లు సమాచారం. దీనిని ఆపిల్ కంపెనీ వచ్చే ఏడాది సెప్టెంబర్ 2025 నెలలో ప్రారంభించవచ్చని అంచనాలు ఉన్నాయి. గత నెలలో యాపిల్ భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 16 సిరీస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో నాలుగు రకాల మోడల్స్‌ను విడుదల చేసింది. అందులో ఐఫోన్ 16 (iPhone 16), ఐఫోన్ 16 ప్లస్ (iPhone 16 Plus), ఐఫోన్ 16 ప్రో (iPhone 16 Pro) , ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ (iPhone 16 Pro Max) ఉన్నాయి. 16ని లాంచ్ చేసిన కొద్ది రోజుల్లోనే తాజాగా.. ఐఫోన్ 17 తయారీ వార్తలు రావడం ప్రారంభించాయి.

READ MORE: Mayonnaise Ban In Telangana : తెలంగాణలో మయోనైజ్ బ్యాన్.. ఎందుకంటే?

కొవిడ్‌ వేళ యాపిల్ సంస్థకు చైనాలో ఎదురైన ఎదురుదెబ్బలతో యాపిల్‌ కంపెనీ ఇతర దేశాల్లో మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా చైనాకు మరో షాక్ తగిలింది. యాపిల్‌ సంస్థ ఐఫోన్ 17 ముందస్తు తయారీని తొలిసారి భారత్‌లో చేపట్టనుంది. గత కొన్నేళ్లుగా పలు ఐఫోన్‌ మోడళ్లు భారత్‌లో తయారు చేస్తోంది. ఇక్కడి నుంచి భారీ సంఖ్యలో ఫోన్లను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. సాధారణంగా ఐఫోన్‌ మోడల్ విడుదలైన తర్వాత మిగితా ఫోన్లను భారత్‌లో తయారు చేస్తూ ఉంటారు. కానీ.. అమెరికాలోని యాపిల్‌ పార్క్‌లో తర్వాతి తరం మొబైల్‌ డిజైన్‌ రూపొందించాక.. కమర్షియల్‌ లాంచ్‌కు ముందు ఫోన్లను మాత్రం చైనాలోనే ఇన్నిరోజులు యాపిల్‌ కంపెనీ చేపట్టింది. కానీ ఇప్పుడు యాపిల్‌ కంపెనీ తన రూట్ మార్చింది. ఐఫోన్17 మోడల్ విషయంలో ముందస్తు తయారీని భారత్‌లోని ఓ ప్లాంట్‌లో నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాల చెబుతున్నాయి. ఇలా తయారు చేసిన ఐఫోన్‌ను 2025 జూన్ తర్వాత యాపిల్‌ సంస్థ సాధారణంగా విడుదల చేస్తుంది. మరీ ముఖ్యంగా కరోనా వేళ చైనాలో యాపిల్‌ సంస్థకు తలెత్తిన సమస్యల దృష్ట్యా ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

READ MORE: Uddhav Thackeray: ‘‘మాతో ఉన్నప్పుడు చాలా సీట్లు ఇచ్చాం’’.. ఉద్ధవ్‌ పరిస్థితిపై బీజేపీ..