Leading News Portal in Telugu

Free gas cylinders scheme will be implemented In AP: Nadendla Manohar


  • కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది..

  • ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి ఏడాదికి రూ. 2600కోట్లతో ఉచిత గ్యాస్ పథకం..

  • చంద్రబాబు- పవన్ కళ్యాణ్ వల్లే ఇతర దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి: మత్రి నాదెండ్ల
Nadendla Manohar: తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దీపం పథకం అమలు చేస్తున్నాం..

Nadendla Manohar: విజయవాడ గన్నవరం నుంచి ఇండిగో విమానంలో విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళా నాయకులు మంత్రికి హారతి ఇచ్చి ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన్న నగరంలోని సన్ రే రిసార్ట్ కు వెళ్ళారు మంత్రి నాదెండ్ల. ఇక, విశాఖ నుంచి రోడ్డు మార్గాన రేపు (గురువారం) శ్రీకాకుళం జిల్లా ఈడు పురం గ్రామం వెళ్లనున్నారు. నవంబర్ ఒకటో తారీఖున శ్రీకాకుళం జిల్లా ఈడు పురం గ్రామంలో జరగబోయే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఈడుపురం గ్రామంలో దీపం పథకం అమలు చేయనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా దీపం పథకం అమలు చేయనున్నాము.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం నిలబడి సంవత్సరానికి 2,600 కోట్ల రూపాయలతో ఉచిత గ్యాస్ పథకం అమలు చేస్తుంది అన్నారు. ప్రతి మహిళకి ఆరోగ్య సమస్య రాకుండా సుమారు కోటి 50 లక్షలు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారు.. గ్యాస్ బుక్ చేసుకున్న సుమారు 24 గంటల నుంచి 48 గంటలలోపు డబ్బులు వారి అకౌంట్ లో జమ అయ్యే విధంగా ప్రణాళిక సిద్ధం చేశాం.. అడ్వాన్స్ రూపంలో చెక్కులను గ్యాస్ కంపెనీలకు అందజేశాం.. గ్యాస్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసి పోయింది.. ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిందన్నారు. ధైర్యంగా చక్కటి నాయకత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్నారు కాబట్టి ఇతర దేశాలు నుంచి పెట్టుబడులు వస్తున్నాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు.