Leading News Portal in Telugu

Safety Precautions for a Fun and Safe Cracking Diwali: APSDMA


  • దీపావళి పండగ వేళ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ జాగ్రత్తలు..

  • బాణాసంచా కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించండి..

  • వీలైనంత వరకు దీపాలను మాత్రమే పెట్టండి: ఏపీఎస్డీఎంఏ
Diwali Festival: దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Diwali Festival: దీపావళికి యావత్ దేశం రెడీ అయింది. వాకిట్లో దీపాల కాంతులు.. గుమ్మం ముందు బాణాసంచా పేలుళ్లు.. చిన్నారుల కేరింతలతో దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ దీపావళి పండుగ సందర్భంగా చిన్నా పెద్దా, ముసలీ ముతకా అందరూ టపాసులు, బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటారు. అయితే, ఈ సంబరాల సమయం విషాదంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. చిన్న పొరబాటు జరిగిన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగను పురస్కరించుకుని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని జాగ్రత్తలు సూచించింది. అగ్ని ప్రమాదం జరిగితే అత్యవసర సహాయం కోసం 101, 112, 100, 1070 టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని కోరింది.

దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
* బాణాసంచా కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించండి.
* వీలైనంత వరకు దీపాలను మాత్రమే పెట్టండి.
* మీ ఇంటి కిటికీలు, తలుపులు మూసివేయండి.. పసి పిల్లలు ఉంటే ఇంటి లోపలే ఉంచండి.
* పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పిల్లలు బాణాసంచా కాల్చవలెను.
* బాణసంచా కాల్చేటప్పుడు ఒక బకెట్ నీరు, ఇసుకను అందుబాటులో ఉంచుకోండి.
* బాణాసంచాతో ప్రయోగాలు చేయొద్దు.. అవి కాల్చేపుడు మీ ముఖాన్ని దూరంగా ఉంచండి.
* కాల్చడంలో విఫలమైన బాణసంచాను మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయొద్దు.
* ఫైర్ క్రాకర్‌లను వెలిగించి విచక్షణా రహితంగా బహిరంగంగా విసిరేయకండి.
* ప్రమాదకర టపాసులు లాంటి బాణాసంచా కాల్చే సమయంలో చేతితో పట్టుకోవద్దు.