Leading News Portal in Telugu

Godavari River Bathing Ghats In Rajahmundry Have Become Disorderly: Margani Bharat


  • రాజమండ్రిలో గోదావరి స్నాన ఘట్టాలు అస్థవ్యస్తంగా తయారయ్యాయి..

  • మురుగు నీటిని గోదావరికి వదిలివేయడంతో దుర్వాసన వస్తుంది..

  • మున్సిపల్ అధికారులు.. ఎన్టీయే కూటమి పార్టీలు నిద్రపోతున్నాయి: మాజీఎంపీ మార్గాని భరత్
Margani Bharat: మురుగు నీటిని గోదావరికి వదిలివేయడంతో దుర్వాసన వస్తుంది..

Margani Bharat: రాజమండ్రిలో గోదావరి స్నాన ఘట్టాలు అస్థవ్యస్తంగా తయారయ్యాయి.. మురికి నీటిని గోదావరిలోకి వదిలివేయడంతో దుర్వాసన వస్తుంది అని వైసీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. నవంబర్ రెండో తేదీ నుంచి కార్తీక మాసం మొదలవుతుంది.. ఈ సందర్భంలో స్నాన ఘట్టాలు బురదమయంగా మారిపోయి.. మురికి నీటితో కంపు కొడుతుందన్నారు. కార్తీక మాసం సందర్భంగా రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి గోదావరి నదిలో పుణ్య స్థానాలు ఆచరిస్తారు అని చెప్పుకొచ్చారు. అలాగే, రాజమండ్రిలోని పవిత్రమైన పుష్కర ఘాటు కోటిలింగాలు, మార్కండేయ ఘాటులతో పాటు గౌతమి ఘాట్ లోనూ ఇదే దుస్థితి నెలకొంది అన్నారు. ఇది రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని మాజీ ఎంపీ భరత్ పేర్కొన్నారు.

అలాగే, మార్కండేయ ఘాట్ లో నరక చతుర్దశి సందర్భంగా గోదావరి నదిలో కలశ పూజ నిర్వహించడానికి వచ్చిన మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘాట్లు ఇలా ఉంటే కార్తీక మాసంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించడం ఎలా అంటూ ప్రశ్నించారు. వెంటనే ఘాట్లు మరమ్మతులు చేపట్టాలని.. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్తీకమాసంలోనే భక్తులకు సౌకర్యాలు కల్పించలేకపోయినా అధికార యంత్రాంగం, ఎన్డీయే కూటమి పార్టీలు నిద్రపోతున్నాయా అంటూ వైసీపీ నేత మార్గాని భరత్ విమర్శించారు.