Leading News Portal in Telugu

Salaar 2 Shoot News is False as of Now


Salaar 2: అంతా తూచ్ అంటే ఎలా?

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బావుందని కొంతమంది బాలేదని కొంతమంది ఇలా రకరకాల ప్రచారాలు చేశారు. అయితే డబ్బులు దండిగానే వచ్చాయి కానీ ఆశించిన మేర రాకపోవడంతో సెకండ్ పార్ట్ ఉండకపోవచ్చు అని ప్రచారం జరిగింది. కానీ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్ 2 సినిమా షూటింగ్ మొదలుపెట్టినట్లు పలువురు బాలీవుడ్ క్రిటిక్స్ తో పాటు బడా మీడియా సంస్థల అధికారిక హ్యాండిల్స్ నుంచి న్యూస్ షేర్ అయింది. అయితే నిజానికి అది నిజం కాదని తెలుస్తోంది.

Pushpa 2: The Rule: ఆ దెబ్బకు మైండ్ బ్లాకవ్వాల్సిందే!

ప్రభాస్ ఆ సినిమా మీద ప్రస్తుతం ఫోకస్ చేయలేదని ఆయన మారుతి రాజా హను రాఘవపూడి హౌజి సినిమాలు మీద ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. అయితే కావాలనే సలార్ 2 గురించి వార్తలు తెరమీదకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. నిజానికి ప్రశాంత్ నీల్ కూడా ప్రస్తుతానికి ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడు మరే సినిమాలు మీద ఫోకస్ పెట్టే అంత టైం లేదు. ఎన్టీఆర్ సినిమా చేసిన తర్వాతే ఆయన వేరే సినిమాల మీద దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆ సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన యష్ కేజిఎఫ్ త్రీ మీద ఆ తర్వాత అవకాశం ఉంటే సలార్ 2 మీద ఫోకస్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.