Leading News Portal in Telugu

“Nothing Hindu-Muslim In Ban On Firecrackers In Delhi”: Arvind Kejriwal


  • ఢిల్లీలో ఫైర్ క్రాకర్స్‌పై నిషేధం..

  • ఇందులో హిందూ-ముస్లిం కోణం లేదన్న అరవింద్ కేజ్రీవాల్..
Arvind Kejriwal: ఢిల్లీలో ఫైర్ క్రాకర్స్‌పై నిషేధం.. హిందూ-ముస్లిం కోణం లేదు..

Arvind Kejriwal: కాలుష్యం నుంచి ప్రజల్ని రక్షించేందుకు బాణాసంచాపై నిషేధం అవసరమని, ఇందులో హిందూ-ముస్లిం కోణం లేదని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం అన్నారు. దీపావళి రోజు ఫైర్ క్రాకర్స్ కాల్చకుండా దీపాలు, కొవ్వొత్తులను వెలిగించాలని కోరారు. ‘‘మనం ఇతరులకు ఏదైనా ఉపకారం చేస్తు్న్నామని కాదు, మనం మనకు మేలు చేసుకుంటున్నాము. ఎందుకంటే పటాసులు కాల్చడం వల్ల కాలుస్యంతో బాధపడుతాము’’ అని అన్నారు.

జనవరి 1, 2025 వరకు ఢిల్లీలోని అన్ని రకాల బాణాసంచా తయారీ, అమ్మకం, నిల్వ, పేల్చడంపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఢిల్లీ ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) గాలి (డిపిసిసి) ద్వారా ఆదేశాలు జారీ చేసింది. హిందువుల పండగని లక్ష్యంగా చేసుకుని బాణాసంచాపై నిషేధం విధించారని బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసిన విమర్శలను ఢిల్లీ మాజీ సీఎం తోసిపుచ్చారు. ఇందులో హిందూ-ముస్లిం అంటూ ఏమీ లేదని, అందరికి ఊపిరి, ప్రాణం అవసరమని అన్నారు. కాలుష్యం కాకుండా దీపాలను వెలిగించాలని, క్రాకర్స్‌ని పేల్చడం మానుకోవాలనే సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా చెప్పాయని ఆయన గుర్తు చేశారు.