Leading News Portal in Telugu

Sivakarthikeyan : అమరన్ ప్రీమియర్ ట్విట్టర్ రివ్యూ


తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వస్తున్న ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మేజర్ ముకుంద్ భార్య ఇందు పాత్రలో మలయాళ భామ సాయి పల్లవి నటిస్తోంది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా నేడు థియేటర్స్ లోకి వస్తున్న ఆ సినిమా ఇప్పటికే ఓవర్సీస్ లో స్పెషల్ ప్రీమియర్స్ కంప్లిట్ చేసుకుంది.

Also Read : KA public Talk : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కిరణ్ అబ్బవరం

ప్రీమియర్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే శివకార్తికేయన్ కెరీర్ బెస్ట్ సినిమా అమరన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ గా శివకార్తికేయన్ అద్భుతంగా నటించాడు. బయోపిక్ తీయడం అంటే కత్తి మీద సాములాంటిది. ఏమంత్రం సినిమాటిక్ లిబర్టీ వంటివి తీసుకున్న కూడా రిజల్ట్ తేడా కొడుతుంది. కానీ అమరన్ విషయంలో దర్శకుడు ఎక్కడ అనవసరపు హంగులు జోడించకుండా ముకుంద్ జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలని రోమాలు నిక్కబొడిచేలా తెరపై మలిచాడు దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి. ఇక ముకుంద్ వైఫ్ పాత్రలో సాయి పల్లవి నటన అద్భుతం. ముఖ్యంగా ముకుంద్ ను ప్రేమించి పెళ్లి చేసుకునే జర్నీ తాను ఎదుర్కున్న అవరోధాలు, కాశ్మిర్ లోయలో భీకర యుద్ధంలో అసువులు బాసిన మేజర్ ముకుంద్ వార్త తెలియాగానే తన జీవితంలో కమ్ముకున్న కారుచీకట్లను దాటి జీవనం సాగిస్తున్న మేజర్ ముకుంద్ భార్యగా సాయి పల్లవి అద్భుత నటన మనసుని బరువెక్కిస్తుందని, GV ప్రకాష్ సంగీతం సినిమాను మరోస్థాయిలో నిలబెట్టిందని టాక్ ఓవర్సీస్ నుండి వినిపిస్తుంది.