Leading News Portal in Telugu

janhvi kapoor pair with naga chaitanya for latest movie


Nagachaitanya : నాగచైతన్య జాన్వీ జోడీ సెట్ అయ్యేనా !

Nagachaitanya : డైరెక్టర్ శివ నిర్వాణ, నాగ చైత‌న్య కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం రాబోతుంది. అంతకుముందు వీరి కాంబోలో వచ్చిన సినిమా మజిలీ. ఈ సినిమా క్లాసికల్ హిట్ కావడంతో మరో సారి రిపీట్ కాబోతున్న కాంబోపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక మరో సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ పై నిర్మించనున్నారు. ఇదొక ల‌వ్ స్టోరీ అని తెలుస్తోంది. శివ నిర్వాణ ల‌వ్ స్టోరీలను స‌హ‌జంగా, ఎమోషనల్ గా తీర్చిదిద్దడంలో సిద్ధహస్తుడు. ఆయ‌న డైరెక్షన్ లో వచ్చిన సినిమాల్లో ఎక్కువగా భావోద్వేగాలను పలికించే విధంగా రూపొందిస్తుంటారు. ఇప్పుడు చైతూకి కూడా అలాంటి కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం నాగ చైత‌న్య ‘తండేల్‌’ అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుందని టాక్. సంక్రాంతికి రాకపోతే, ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు మేకర్స్. ఈ సినిమా కోసం చైతూ బాడీ లాంగ్వేజ్, ఫిట్‌నెస్ పరంగా చాలా కష్టపడ్డారట.

యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాగ చైతన్య రియలిస్టిక్ రోల్‌లో కనిపించబోతున్నారు. దాంతో ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగానే చైతూ తన స్టైల్ మార్చుకుని, సాఫ్ట్ లవ్ స్టోరీ వైపు వెళ్లాలనుకుంటున్నాడట. అందుకే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో స్పీడ్ పెరిగింది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ని హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయట. జాన్వీ కపూర్ ఇప్పటికే దేవర సినిమాతో టాలీవుడ్ ఆరంగేట్రం చేసి తొలి కమర్షియల్ హిట్ అందుకుంది. అలాగే త్వరలో స్టార్ట్ కాబోయే రామ్ చరణ్ 16వ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పుడు, అక్కినేని వారసుడితో ఆమె జతకట్టడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో ఏఎన్నార్, నాగార్జులతో జతకట్టిన ఆమె అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకంగా అనిపిస్తుంది. కాంబినేషన్‌ విషయంలో ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ విషయంలో ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు కానీ, కాంబినేషన్ దాదాపుగా ఫైనల్‌ అయినట్లు సమాచారం.