Leading News Portal in Telugu

highest paid players in the IPL so far as rohith sharma is on top the remain list is


  • ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్లు..
  • మొదటి స్థానంలో రోహిత్
  • రెండో స్థానంలో ధోని.
IPL History: ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్లు ఎవరంటే

నేడు (సెప్టెంబర్ 31) ఐపీఎల్ 2025 సంబంధించి అన్ని జట్లకు రిటెన్షన్ ప్లేయర్ల వివరాలు తెలిపేందుకు చివరి తేదీ. నేటి సాయంత్రం ఏఏ జట్టు ఏఏ ఆటగాళ్లను అంటిపెట్టుకొని ఉందన్న విషయం తెలిసిపోతుంది. ఇప్పటికే ఐపీఎల్ లోని వివిధ జట్లు ఏ ఆటగాళ్లను ఉంచుకోవాలో.. ఏ ఆటగాళ్లను వేళానికి వదిలేస్తుందన్న వివరాలు దాదాపు ఒక అంచనాకు వచ్చాయి. ఇది ఇలా ఉండగా.. వచ్చే ఏడాది మార్చి చివరివారం లేదా.. ఏప్రిల్ మొదటి వారంలో మొదలు కాబోయే ఐపీఎల్ సీజన్ సంబంధించి అతి త్వరలో మెగా వేలం జరగబోతోంది. ఇకపోతే, ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ సీజన్లలో పాల్గొన్న ఆటగాళ్లలో అత్యధికంగా పారితోషకం పొందారన్న విషయాన్ని చూస్తే..

ఈ లిస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందు వరుసలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ కు ఐదు టైటిలను అందించిన రోహిత్ శర్మ రూ. 194.6 కోట్లు రూపాయలను ఐపీఎల్ ద్వారా సంపాదించాడు. ఈ లిస్టులో రెండవ స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడైన మహేంద్ర సింగ్ ధోని రూ. 188.84 కోట్ల రూపాయలను అర్జించాడు. ఇక ఈ లిస్టులో మూడో ఆటగాడుగా టీమిండియా డాషింగ్ బ్యాట్స్మెన్, ఆర్సిబి ఆడగాడైన విరాట్ కోహ్లీ రూ. 188.2 కోట్లను అర్జించాడు.

ఆ తర్వాత అత్యధికంగా ఐపీఎల్లో పారితోషకం పొందిన ఆటగాళ్లలో.. నాలుగో ఆటగాడిగా టీమిండియా ఆల్ రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడైన రవీంద్ర జడేజా రూ. 125.01 కోట్ల రూపాయలతో ఉన్నాడు. ఇక ఈ లిస్టులో ఐదో ఆటగాడిగా వెస్టిండీస్ దిగ్గజ ఆటగాళ్లలో ఒకరైన సునీల్ నారాయన్ కేకేఆర్ టీం తరఫున ఆడుతూ రూ. 113.25 కోట్ల రూపాయలను అర్జించాడు.