Leading News Portal in Telugu

Trump told Netanyahu he wants Gaza war over by time he enters office sources


  • గాజా యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ట్రంప్ ఫోన్

  • వైట్‌హౌస్‌లో అడుగుపెట్టేలోపు ముగియాలని ట్రంప్ సూచన
Trump: గాజా యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ట్రంప్ సూచన ఇదే!

హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ గతేడాది నుంచి యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికే గాజాను ఇజ్రాయెల్‌ నేలమట్టం చేసింది. ప్రస్తుతం ఇంకా ఇజ్రాయెల్ దాడులు సాగిస్తోంది. తాజాగా ఇదే వ్యవహారంపై అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌కు కీలక సూచన చేశారు. యుద్ధానికి ముగింపు పలకాలని ఇజ్రాయెల్‌కు పిలుపునిచ్చారు. తాను అమెరికా ఎన్నికల్లో గెలిచి వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టే నాటికి గాజాలో యుద్ధం ముగియాలని నెతన్యాహును ట్రంప్ కోరారు. ఈ విషయంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహుతో ట్రంప్ మాట్లాడినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌ కథనాలు పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: Puja Khedkar: వివాదంగా పూజా ఖేద్కర్ తండ్రి ఎన్నికల నామినేషన్.. కన్‌ఫ్యూజన్‌కు కారణమిదే!

నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ బరిలో ఉన్నారు. ఇద్దరూ కూడా పోటాపోటీగా తలపడుతున్నారు. అయితే తాజా సర్వేలో ట్రంప్ వైపే మెజార్టీ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు అధ్యక్ష పీఠం కోసం ట్రంప్ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. వైట్‌హౌస్‌లోకి అడుగుపెడతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాజాపై యుద్ధం ముగించాలని నెతన్యాహుకు ట్రంప్ సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: IPL Retention 2025: అత్యధిక ధర బుమ్రాకే.. ముంబై ఇండియన్స్ రిటైన్ లిస్ట్ ఇదే!