- సంగారెడ్డి జిల్లా ఖానాపూర్(బీ) గ్రామంలో దారుణం
-
బంగారు గుండ్ల కోసం అమ్మమ్మను హత్య చేసిన మనవడు -
ఇంట్లో ఎవరూ లేని సమయంలో డబ్బులు.. మెడలోని బంగారు గుండ్ల కోసం -
అమ్మమ్మ దుర్గమ్మ(60)తో గొడవపడ్డ మనవడు మహేష్(26) -
అమ్మమ్మ ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేసిన మనవడు.

కష్టపడి డబ్బు సంపాదించుకోవడం అంటే ఇష్టం ఉండదు.. డబ్బుల కోసం దొంగతనాలు, దోపిడీలు చేస్తుంటారు. అవసరమైతే సొంత వారిని అని చూడకుండ చంపేస్తారు. జల్సాలకు అలవాటు పడి దేనికైనా తెగించేస్తారు. చెడు వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు.. అమ్మమ్మను హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…
సంగారెడ్డి జిల్లా నిజాంపేట (మం) ఖానాపూర్(బీ) గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఒంటిపై ఉన్న బంగారు గుండ్ల కోసం అమ్మమ్మను హత్య చేశాడు మనవడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో డబ్బులు, మెడలోని బంగారు గుండ్ల కోసం అమ్మమ్మ దుర్గమ్మ(60)తో గొడవపడ్డాడు మనవడు మహేష్(26). ఈ క్రమంలో.. అమ్మమ్మ ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం బంగారు గుండ్లు తీసుకుని మనవడు మహేష్ పరార్ అయ్యాడు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.