Leading News Portal in Telugu

సైనికులతో కలిసి మోడీ దీపావళి సంబరాలు | modi deewali with jawans| gujarat| kutch| custom


posted on Nov 1, 2024 10:32AM

ప్రధాని నరేంద్రమోడీ సైనికులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. దీపావళి పర్వదినం రోజున గుజరాత్ పర్యటనలో ఉన్న మోడీ అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న జవాన్లతో కలిసి దీపావళిని వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మోడీ సైనిక దుస్తులతో వారితో కలిసిపోయి ఆనందంగా దీపావళి జరుపుకున్నారు.

ఈ సందర్భంగా జవాన్లకు స్వీట్లు పంచి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని ఏటా దీపావళి పండుగను జవాన్లతో కలిసి జరుపుకోవడం ఒక ఆనవాయితీగా మార్చుకున్న సంగతి విదితమే.  2014లో మోడీ తొలి సారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. గత పదేళ్లుగా ఆయన ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు.