Leading News Portal in Telugu

Telangana state ranks first in liquor sales


  • మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం..

  • రెండో స్థానంలో ఏపీ ఉంది..
Liquor Sales: మద్యం అమ్మకాల్లో మనమే టాప్.. రెండో స్థానంలో ఎవరంటే..!

Liquor Sales: మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణ భారతదేశంలో మద్యం విక్రయాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, ఏపీ రెండో స్థానంలో ఉంది. ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ (ఎన్‌ఐపీఎఫ్‌పీ) ప్రకారం తెలంగాణలో గతేడాది సగటు వ్యక్తి మద్యం కోసం రూ.1,623 ఖర్చు చేయగా, ఏపీలో రూ.1,306 ఖర్చు చేశారు. పంజాబ్‌లో రూ.1,245, ఛత్తీస్‌గఢ్‌లో రూ.1,227 ఒక్కో వ్యక్తి ఖర్చుచేస్తున్నట్లు పేర్కొంది. ఇక మరోవైపు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మద్యంపై తక్కువ ఖర్చు చేస్తున్నాయని అంచనా. తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలు, వెయ్యికి పైగా బార్లు, పబ్బులు ఉన్నాయి. దసరా సందర్భంగా దాదాపు రూ.1,000 కోట్ల మద్యం విక్రయాలు జరిగిన విషయం తెలిసిందే. 11 లక్షల కేసుల మద్యం, 18 లక్షల కేసుల బీర్లు విక్రయించిన సంగతి తెలిసిందే. దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా బీరు కొనుగోలు చేస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో బీర్ల కోసం రూ.302.84 లక్షలు ఖర్చు చేసినట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్‌లో 169 బీర్లు అమ్మకాలు జరిగాయి. తెలంగాణలో మద్యం విక్రయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది.
Hyderabad Crime: చందానగర్ డ్రగ్స్ కేసు లో ట్విస్ట్ .. నిందితుడు డాక్టర్ కాదా..?