Leading News Portal in Telugu

CM Chandrababu Naidu Stars Free Gas Scheme in AP


  • ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ ప్రారంభం
  • ఈదుపురం నుంచి పంపిణీకి శ్రీకారం
  • సొంత ఇల్లు అడిగిన మహిళ
CM Chandrababu: సొంత ఇల్లు అడిగిన మహిళ.. హామీ ఇచ్చిన బాబు!

ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకం ప్రారంభమైంది. దీపం 2.0లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. ఈదుపురంలో మహిళా లబ్ధిదారు శాంతమ్మ ఇంటికి వెళ్లిన సీఎం.. ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ అందజేశారు. అనంతరం జానకమ్మ అనే మహిళకు బాబు ఒంటరి మహిళ పింఛను అందజేశారు. సీఎం తన ఇంటికి రావడంతో జానకమ్మ సంతోషం వ్యక్తం చేశారు.

సీఎం చంద్రబాబును జానకమ్మ సొంత ఇల్లు అడిగారు. ఇల్లు కట్టిచ్చేస్తారని బాబు హామీ ఇచ్చారు. రేపటి నుంచే మీ ఇంటి పని ప్రారంభిస్తాం అని చెప్పారు. అదే సమయంలో రేపటి నుంచే పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. డ్వాక్రాలో లీడర్‌గా ఉన్నావు పది రూపాయలు సంపాదించుకోవాలి కదా అమ్మ అని జానకమ్మకు సీఎం సలహా ఇచ్చారు. థైరాయిడ్, డయాబెటిక్‌కు జనరిక్ మెడిసిన్స్ ఉంటే చూడాలని కలెక్టర్‌కు బాబు సూచన చేశారు. 500 నుండి 4000 అందుకుంటున్నాను, మీరు మాకు దేవుడు అని బాబుతో జానకమ్మ అన్నారు. 20 సంవత్సరాలుగా పేదరికంలో మగ్గుతున్నామని సీఎంతో జానకమ్మ అనగా.. ఆమెను ఓదార్చారు.