Leading News Portal in Telugu

Nara Bhuvaneswari says best wishes to ntr to entry into movies trough social media


  • నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో తరం హీరో.
  • నందమూరి జానకిరామ్ కొడుకు
  • నందమూరి హరికృష్ణ మనవడు ఎన్టీఆర్ టాలీవుడ్‌లోకి అడుగు
  • రామ్ సినిమా రంగంలోకి వస్తునందుకు థ్రిల్లింగ్ గా ఉందన్న నారా భువనేశ్వరి.
Nara Bhuvaneswari: రామ్ సినిమా రంగంలోకి వస్తునందుకు థ్రిల్లింగ్ గా ఉంది

Nara Bhuvaneswari: నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో తరం హీరో టాలీవుడ్‌కి రాబోతున్న సంగతి విధితమే. నందమూరి జానకిరామ్ కొడుకు, నందమూరి హరికృష్ణ మనవడు ఎన్టీఆర్ టాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. వైవీఎస్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త హీరోగా తెరంగేట్రం చేయనున్నాడు. అతి త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నాడు. దర్శకుడు వైవిఎస్ చౌదరి ఫస్ట్‌ లుక్‌ రివీల్‌ దీపావళి సందర్భంగా అందించారు. ఇకపోతే, ఎన్టీఆర్ మంచి సైజు, రంగు, మంచి వాయిస్ కూడా ఉంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు సినిమా పరిశ్రమలోకి వస్తునందుకు విషెస్ చెప్పారు.

Merugu Nagarjuna: రాజకీయాలలో ఎదుగుతున్న ఒక దళితుడిని టార్గెట్ చేస్తున్నారు.. తప్పు తేలితే దేనికైనా సిద్ధం

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి కూడా జానకీరామ్‌ కుమారుడు ఎన్టీఆర్‌కి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపింది. వైవిఎస్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో మా రామ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది గర్వించదగిన సమయం. అతనికి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం ఉంటుందని నమ్ముతున్నాను. జానకిరామ్‌ తనయుడిగా, నా దివంగత హరికృష్ణగారి మనవడిగా, ఎన్టీఆర్‌గారి మునిమనవడిగా మా కుటుంబ వారసత్వాన్ని గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం నాకు ఉందని అన్నారు.

IND vs NZ: తడబడ్డ టీమిండియా బ్యాటర్లు.. మొదటిరోజు ఆట ముగిసే సరికి

మరోవైపు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్, మోక్షజ్ఞల సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి రానున్నాయి. అంతేకాదు విడుదల కూడా దాదాపు ఒకేసారి చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి ఫ్యామిలీతో పాటు వారి హీరోలు ఎన్టీఆర్ ను ఎలా ఆదరిస్తారో ఆసక్తికరంగా మారింది. నందమూరి కుటుంబం నుంచి ఎందరో హీరోలు పుట్టారు. ఈ తరంలో ఎన్టీఆర్, కళ్యాణ్ మాత్రమే ప్రత్యేకంగా నిలిచారు. మరి నాలుగో తరం సీషయానికి వస్తే ఇప్పుడు ఎన్టీఆర్ రంగ ప్రవేశం చేస్తుండడంతో.. ఆయనకు అందరి నుండి సపోర్ట్ లభిస్తుందని ఆలోచయించడంలో ఎలాంటి సందేహం లేదు.