- కపిలేశ్వర స్వామి ఆలయంలో నెల రోజులు పాటు హోమాలు
-
రేపటి నుండి డిసెంబర్ 1వ తేది వరకు నిత్యం హోమాలు నిర్వహించనున్న అర్చకులు -
టీటీడీ నిర్వహిస్తున్న హోమ మహోత్సవాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ -
2012వ సంవత్సరంలో ఈ హోమాలను ప్రారంభించిన టీటీడీ.

పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోకకల్యాణం కోసం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో విశేషపూజ హోమ మహోత్సవాలు జరుగుతున్నాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు హోమాలు జరగనున్నాయి. అందులో భాగంగా రేపటి నుంచి (నవంబరు 2 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు) నిత్యం హోమాలు నిర్వహించనున్నారు అర్చకులు. అలాగే.. రేపటి నుంచి 4వ తేదీ వరకు గణపతి హోమం.. 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సుబ్రమణ్యస్వామి హోమం నిర్వహించనున్నారు.
ఈనెల 8వ తేదీన దక్షిణామూర్తి హోమం.. 9వ తేదీన నవగ్రహ హోమం, 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చండీ యాగం, 19వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రుద్రయాగం, 30వ తేదీన కాలబైరవస్వామి హోమం, డిసెంబర్ 1వ తేదీన చండీకేశ్వరస్వామి హోమం నిర్వహించనున్నారు అర్చకులు. శ్రీ కపిలేశ్వరాలయంలో టీటీడీ నిర్వహిస్తున్న హోమ మహోత్సవాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. 2012వ సంవత్సరంలో ఈ హోమాలను టీటీడీ ప్రారంభించింది. ఈ హోమాల్లో పాల్గొంటున్న భక్తుల సంఖ్య ప్రతి ఏడాదీ పెరుగుతోంది. ఈ హోమాలను సొంతంగా చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పనికావడంతో భక్తుల సౌకర్యార్థం సామూహికంగా ఈ హోమాలను టీటీడీ నిర్వహిస్తోంది.