Leading News Portal in Telugu

Union Minister Rammohan Naidu said that the development of Andhra Pradesh is possible only because of Chandrababu and Modi.


  • శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఈదుపురంలో ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం

  • ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు రావడం ఆనందంగా ఉంది- రామ్మోహన్ నాయుడు

  • గత పాలనలో ఇచ్ఛాపురంలో తిరగాలంటే స్థానికులు భయపడే వారు- రామ్మోహన్ నాయుడు

  • ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు.. మోడీ వల్లనే సాధ్యం అవుతుంది- రామ్మోహన్ నాయుడు.
Ram Mohan Naidu: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు, మోడీ వల్లే సాధ్యం..

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఈదుపురంలో ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఈదుపురంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లిన బాబు.. దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, ఎమెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. సూపర్ సిక్స్‌లో భాగంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. గత పాలనలో ఇచ్ఛాపురంలో తిరగాలంటే భయం భయంగా స్థానికులు ఉండేవారు.. ఇప్పుడు అందరూ చిరునవ్వుతో ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు, మోడీ వల్లనే సాధ్యం అవుతుందని అన్నారు. అధికారంలో రాగానే పింఛన్లు మూడు నెలలు బకాయి ఒకేసారి ఇచ్చి హామీ నెరవేర్చుకున్నాం.. సూపర్ సిక్స్‌లో ప్రతి హామీని నెరవేరుస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఉద్దాన సమస్యలను త్వరలో పరిష్కరిస్తుంది.. శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని ముఖ్యమంత్రి చెప్పారు.. దానిపై కార్యాచరణ రూపొందిస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ ఇచ్ఛాపురం నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. 2019లో దుర్మార్గుల పాలన 5 సంవత్సరాలు జరిగింది.. సచివాలయం కూడా తనఖా పెట్టి రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని ఆరోపించారు. ప్రజల కోసం గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంటే కొంతమంది దీన్ని వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ర్ట ఆర్థిక పరిస్థితి బాలేదు.. ఇప్పుడిప్పుడే రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం.. ఇచ్చిన ప్రతి హామీని తమ నాయకుడు చంద్రబాబు నెరవేరుస్తారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.