Leading News Portal in Telugu

A three and a half year old child was brutalized.. and then killed and buried..!


  • తిరుపతి జిల్లా వడమాలపేటలో చిన్నారి మిస్సింగ్ ఘటన విషాదాంతం..

  • చిన్నారిని తీసుకెళ్లిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

  • నిందితుడు ఇచ్చిన సమాచారంతో బాలిక మృతదేహం వెలికితీత..

  • చాక్లెట్స్ కొనిపిస్తానని మూడున్నరేళ్ల చిన్నారిని తీసుకెళ్లిన యువకుడు..
Tirupati Crime: మూడున్నరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం.. ఆపై చంపి పూడ్చిపెట్టాడు..!

Tirupati Crime: తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారి మిస్సింగ్‌.. విషాదాంతమైంది. చిన్నారిని ఎత్తుకెళ్లిన యువకుడు నాగరాజు అలియాస్‌ సుశాంత్‌… పాపను చంపి పూడ్చిపెట్టాడు. విచారణలో యువకుడు ఇచ్చిన సమాచారం ప్రకారం… పూడ్చిపెట్టిన స్థలానికి వెళ్లిన పోలీసులు… చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. వడమాలపేట మండలం ఏఎం పురానికి చెందిన పసిపాపకు.. చాక్లెట్లు కొనిస్తానని చెప్పి తీసుకెళ్లాడు యువకుడు నాగరాజు. పాప కనిపించకపోవడంతో… పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు.. కొన్ని గంటల్లోనే కేసును చేధించారు. నిందితుడు నాగరాజును పట్టుకున్నారు.

ఇక, ఈ ఘటనపై ఎన్టీవీతో మాట్లాడిన ఎస్పీ సుబ్బారాయుడు‌‌… వడమాలపేట ఘటనలో మూడున్నర సంవత్సరాల చిన్నారి చంపింది.. ఆ చిన్నారి మామే‌‌ అని తెలిపారు.. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి చాక్ లెట్ లు కోని ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి అత్యాచారం చేసి చంపేశాడు.. చిన్నారి హత్యపై అన్ని ఆధారాలు సేకరించామని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చూస్తాం అన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు..