- హమాస్ చివరి కీలక నేతను చంపేసిన ఇజ్రాయెల్..
-
కారుపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో కసబ్ చనిపోయాడు.. -
కసబ్ మరణించాడని ధృవీకరించిన హమాస్ వర్గాలు..

Israel–Hamas war: హమాస్ ఉగ్రవాద సంస్థలో మిగిలిన చివరి కీలక నేతను చంపేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. హమాస్ పొలిట్‌బ్యూరో సభ్యుడైన కసబ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ పేర్కొనింది. గాజా స్ట్రిప్‌లోని ఇతర మిలిటెంట్ గ్రూపులను అతడు సమన్వయం చేస్తున్నాడని ఐడీఎఫ్ ప్రకటించింది. కారుపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో కసబ్ మరణించాడని హమాస్ వర్గాలు ధృవీకరించింది.
కాగా, ఇటీవలే ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 దాడుల సూత్రధారి యహ్వా సిన్వర్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మట్టుబెట్టింది. అంతకు ముందు హమాస్ చీఫ్‌గా ఉన్న ఇస్మాయిల్ హానియేను కూడా ఇజ్రాయెల్ సైన్యం చంపేసింది. హమాస్ గ్రూప్ ను లేకుండా చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఉగ్రవాద సంస్థలోని కీలక నేతల ఎలిమినేషన్‌పై ఐడీఎఫ్ దృష్టి పెట్టినట్లు పేర్కొనింది. తాజా దాడితో హమాస్ లోని కీలక నేతలు అందరు హతమైనట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
అయితే, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలిటెంట్ గ్రూప్‌ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఈశాన్య లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం.. వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపు 52 మంది మరణించగా.. 72 మంది గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.