posted on Nov 2, 2024 1:04PM
మాజీమంత్రి మేరుగ నాగార్జునపై రేప్ కేసు నమోదైంది. ఉద్యోగం ఇప్పిస్తానని విజయవాడకు చెందిన మహిళను లైంగికంగా వాడుకున్నట్లు మేరుగపై ఆరోపణలున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు మహిళ ఫిర్యాదు చేయడంతో మాజీమంత్రిపై కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మేరుగు నాగార్జునపై అత్యాచారం, మోసం కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రికి సహకరించిన ఆయన పీఏపై బెదిరింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.