Leading News Portal in Telugu

Central Minister Kishan Reddy Met Chiranjeevi at His Residence


By Bhargav Chaganti
  • చిరంజీవి ఇంటికి వెళ్లిన కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

  • దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కిషన్ రెడ్డి

  • మెగాస్టార్‌ లాంటి మంచి వ్యక్తిని కలవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందన్న కిషన్ రెడ్డి

Chiranjeevi: చిరంజీవి ఇంటికి వెళ్లిన కేంద్ర మంత్రి

చిరంజీవి ఇంటికి వెళ్లి కలిశారు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ సంధర్భంగా కిషన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Chiru
తన దాతృత్వం, చలనచిత్ర పరిశ్రమకు చేసిన కృషి ద్వారా చాలా మందికి స్ఫూర్తినిచ్చిన మెగాస్టార్‌ లాంటి మంచి వ్యక్తిని కలవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది అని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఫొటోలు షేర్ చేశారు.
Chiru1
ఇక తాజాగా ఏఎన్నార్‌ జాతీయ అవార్డును నటుడు చిరంజీవి అందుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అక్కినేని జాతీయ పురస్కార వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ చేతుల మీదుగా చిరంజీవికి పురస్కారాన్ని ప్రదానం చేశారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా సెప్టెంబరు 20న నాగార్జున ఈ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.
Chiru2
అవార్డు ఇవ్వనున్నామని చెప్పగానే చిరంజీవి ఎమోషనల్‌ అయ్యారని, దానికంటే పెద్ద అవార్డు లేదన్నారని నాగార్జున ఈ క్రమంలో తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

  • Tags
  • central minister kishan reddy

  • Chiranjeevi

  • Chiranjeevi Residence

  • Kishan Reddy