Leading News Portal in Telugu

Physical Harassment on Minor Girl, Young Man Arrested in Tirupati


Tirupati Crime: లాడ్జిలో మైనర్‌ బాలికపై అత్యాచారయత్నం.. యువకుడు అరెస్ట్

Tirupati Crime: తిరుపతిలోని ఓ లాడ్జిలో మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఫోక్సోకేసులో ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలోని ఓ విద్యాలయంలో ఆ బాలిక 9వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది. బాలిక ప్రవర్తనను గమనించిన తల్లిదండ్రులు విషయం ఆరా తీసి అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చెన్నైలోని ఓ హోటల్‌లో పని చేస్తున్న సతీష్‌కు బాలిక ఆన్‌లైన్‌ ద్వారా పరిచయమైంది. యువకుడిని వెస్ట్ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన సతీష్ (22)గా గుర్తించారు. నిందితుడిపై ఫోక్సోకేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు అలిపిరి పోలీసులు.

మొత్తంగా లాడ్జిలో బాలికతో యువకుడిని చూసి కంగుతిన్నారు స్థానికులు.. ఇంత జరుగుతున్నా లాడ్డీల యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. లాడ్జీలపై చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాగా, ఏ సిటీలో చూసినా.. ఓ పట్టణంలో చూసినా.. లాడ్జిలు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి.. బాలురు, బాలికలకు సైతం ఎలాంటి ఆంక్షలు లేకుండా కొన్ని లాడ్జీలు అనుమతించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నా.. చాలా లాడ్జీలు చూసిచూడనట్టుగా వ్యవహరించడంతో.. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.