Leading News Portal in Telugu

Uttam Kumar Reddy Assures Support for Rice Procurement in Telangana


  • ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు సృష్టించ వద్దు
  • ప్రభుత్వం
  • రైస్ మిల్లర్లు పరస్పరం తోడ్పాటు నందించుకోవాలి
  • ధాన్యం కొనుగోలులో మిల్లర్ల సహకారం తప్పనిసరి : మంత్రి ఉత్తమ్‌
Uttam Kumar Reddy : ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకరావొద్దు

Uttam Kumar Reddy : ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకరావొద్దని, 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ, ధాన్యం కొనుగోళ్ళకు 30 వేల కోట్ల అంచనా వేసినట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే కొనుగోళ్లకై 20 వేల కోట్ల కేటాయించినట్లు ఆయన తెలిపారు. అవసరమయితే అదనపు నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు సృష్టించవద్దన్నారు. ప్రభుత్వం, రైస్ మిల్లర్లు పరస్పరం తోడ్పాటు నందించుకోవాలని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల సహకారం తప్పనిసరి అని ఆయన అన్నారు. సియంఆర్ ప్రభుత్వానికి చేరగానే బ్యాంక్ గ్యారంటీ వాపస్ అని, కలెక్టర్లు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్వవేక్షించాలన్నారు.

Delhi: లారెన్స్ పేరుతో పప్పూ యాదవ్‌ను బెదిరిస్తున్న వ్యక్తి అరెస్ట్.. విచారణలో సంచలన విషయాలు..

మిల్లర్ల డిమాండ్ మేరకు మిల్లింగ్ చార్జీల పెంపు చేసినట్లు ఆయన తెలిపారు. సన్నాలకు 10 నుండి 50 రూపాయలకి, దొడ్డు రకానికి 10 నుండి 40 రూపాయల పెంపు చేసినట్లు, 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువకు గోడౌన్ ల ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మొట్టమొదటి సారిగా సన్నాలకు 500 బోనస్ ఇస్తున్నామన్నారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతుల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. అకాల వర్షాలతో రైతులు నష్టాల బారిన పడొద్దని, ప్రభుత్వం నిర్ణయించిన 7,572 కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించాలన్నారు. ఇప్పటికే 4,598 కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తి అయ్యేంత వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు ఉత్పన్నమైతే నేరుగా సంప్రదించండన్నారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌.

Bigg Boss 8 : మరో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ఔట్.. ఈసారి ఎవరంటే?