- బండి సంజయ్ పై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్..
-
జాతీయ రహదారి కోసం ఎక్సటెన్షన్ పై దృష్టి పెట్టాలని సూచన..

Vinod Kumar: కేంద్ర మంత్రి బండి సంజయ్ తిట్ల పురాణం బందు చేసి జాతీయ రహదారి కోసం ఎక్సటెన్షన్ చేయాలని కోరుతున్నా అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విభజన చట్టం ద్వారా ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కేంద్రం ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిందన్నారు. జాతీయ 365 సూర్యాపేట నుండి దుద్దెఢ వరకు ఉండేది, దుద్దేడ నుండి సిరిసిల్ల మీదుగా కోరుట్లకు వరకు రహదారి విస్తరించాలని ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. జాతీయ రహదారి కోరుట్ల నుండి దుద్దెద వరకు వెన్ను పూస లాగ ఉండేలా ప్రతిపాధించామన్నారు. బండి సంజయ్ తిట్ల పురాణం బందు చేసి జాతీయ రహదారి కోసం ఎక్సటెన్షన్ చేయాలని కోరుతున్నానని అన్నారు.
Read also: Nagarjuna Sagar to Srisailam Tour: ప్రారంభమైన నాగార్జున సాగర్ టూ శ్రీశైలం లాంచ్ ప్రయాణం…
సిరిసిల్ల నుండి పాములాగా రహదారి వేస్తున్నారు దానిని విరమించుకోవాలని తెలిపారు. సిరిసిల్ల లో ఉన్న మధ్య తరగతి ప్రజలు రహదారి లో జాగలు కోల్పోతున్నారని మండిపడ్డారు. రైల్వే లైన్ ఎలా వస్తుందో దాని ప్రక్కన రహదారి వేసేలా కృషి చేయాలన్నారు. రాజమండ్రి లో ఉన్న మాదిరిగా తెలంగాణలో రైల్వే కం బ్రిడ్జి రహదారి నిర్మాణం చేయాలని తెలిపారు. స్వాతంత్య్ర వచ్చినప్పటి నుండి తెలంగాణ కు చాలా అన్యాయం జరిగిందన్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ, ఆర్మూరు నుండి జాగ్దేవ్ పూర్ వరకు రెండు రహదారులు రావడం జరుగుతుందన్నారు. రెండు జాతీయ రహదారి ఎక్టెన్షన్ అయ్యేలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ తో మాట్లాడి బండి సంజయ్ కృషి చేయాలని అన్నారు. రహదారి విస్తరణ ఎక్సటెన్షన్ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. మంచి రోడ్డు లేకపోతే మనమే నష్టపోతామన్నారు. భూములు కోల్పోయిన వారికి రెట్టింపు పరిహారం ఇవ్వాలన్నారు.
Tyson Naidu : ‘టైసన్ నాయుడు’లుక్ రిలీజ్.. మరీ ఇంత రస్టిక్ గా ఉన్నావేం బెల్లంకొండ