Leading News Portal in Telugu

Scorpio plunged into the pond in incident eight people are dead


  • ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.
  • చెరువులోకి దూసుకెళ్లిన స్కార్పియో..
Scorpio Road Accident: చెరువులోకి దూసుకెళ్లిన స్కార్పియో.. ఎనిమిది మంది మృతి

Scorpio Road Accident: ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ ఓ స్కార్పియో అదుపు తప్పి లోతైన చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతి చెందారు. ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలతో బయట పడ్డాడు. కానీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చెరువులో మరో యువకుడు కనిపించకుండా పోగా.. తెల్లవారు జామున అతడి డెడ్ బాడీ స్థానికులు గుర్తించారు. ఘటన సమాచారం అందుకున్న రెస్క్యూ టీం అక్కడికి సహాయక చర్యలు చెప్పట్టారు. శనివారం అర్థరాత్రి ప్రమాదం జరిగింది. మృతుల్లో మహిళా ఉపాధ్యాయురాలు కూడా ఉంది. మహిళా ఉపాధ్యాయురాలు స్కార్పియో బుక్ చేసుకుని సూరజ్‌పూర్‌కు వెళ్తున్నట్లు సమాచారం. ఈ సమయంలో కారులో మరికొందరు కూడా ఎక్కారు.

మార్గమధ్యంలో రాత్రి భోజనం ముగించుకుని సూరజ్‌పూర్‌కు వెళుతుండగా.. రాజ్‌పూర్ సమీపంలోని బుధ బాగీచా సమీపంలో స్కార్పియో అదుపు తప్పి రాంగ్ సైడ్‌లోకి వెళ్లి చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని, డ్రైవర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో స్కార్పియో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. ఈ ప్రమాదం గురించి ప్రజలు వెంటనే రాజ్‌పూర్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దాదాపు గంటన్నర పాటు శ్రమించిన తర్వాత జేసీబీ సాయంతో వాహనాన్ని బయటకు తీశారు. సెన్సార్ కారణంగా తలుపు లాక్ చేయబడింది. దాంతో ఎవరూ బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో అందరూ లోపలే చనిపోయారు. ఘటన సమాచారం అందుకున్న సమరి ఎమ్మెల్యే ఉద్దేశ్వరి పైక్రా కూడా రాత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. అతి వేగం, డ్రైవర్ మద్యం సేవించడం ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు.