Leading News Portal in Telugu

Mumbai Police receives death threat for UP CM Yogi Adityanath..


  • 10 రోజుల్లో యోగి ఆదిత్యనాథ్ సీఎం పదవికీ రాజీనామా చేయాలని డిమాండ్..

  • యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తామని హెచ్చరికలు..

  • ముంబై ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపుల మెసేజ్..
Yogi Adityanath: యూపీ సీఎం  ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తాం.. ముంబై పోలీసులకు బెదిరింపుల మెసేజ్

Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తామంటూ ముంబయి పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఎన్సీపీ నేత, మాజీమంత్రి బాబా సిద్ధిఖీలాగా యూపీ సీఎంను కూడా చంపుతాం అంటూ దుండుగులు అందులో వార్నింగ్ ఇచ్చారు. ఆయన పది రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఈ మెసేజ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు.

అయితే, గత నెలలో మహారాష్ట్ర ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సభ్యులు కాల్చి చంపేశారు. అలాగే, బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్ సల్మాన్‌ ఖాన్ తో సన్నిహితంగా ఉన్నందుకే అతడ్ని చంపామని నిందితులు తెలిపారు. ఆ తర్వాత నుంచి పలువురికి లారెన్స్‌ గ్యాంగ్‌ నుంచి హెచ్చరికలు వచ్చాయి. సిద్ధిఖీ కుమారుడు జీశాన్‌ సిద్ధిఖీ కూడా హిట్‌లిస్ట్‌లో ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే అతడికి కూడా బెదిరింపు కాల్స్‌ వచ్చాయి.