- నవంబర్ ఐదున జరగబోతున్న అమెరికా అధ్యక్ష ఎన్నిక.
- అధ్యక్ష పదవికి పోటీ పోటీగా డోనాల్డ్ ట్రంప్ – కమల హారిస్
- అధికారంలోకి వస్తే వాటి ధరలను తగ్గిస్తా డోనాల్డ్ ట్రంప్.

Donald Trump: అమెరికా దేశంలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారం దాదాపు చివరి దశకు చేరుకుంది. అధ్యక్ష పదవికి పోటీపోటీగా డోనాల్డ్ ట్రంప్, కమల హారిస్ లు భారీగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి ప్రచారం చేశారు. ఇందులో భాగంగా రిపబ్లిక్ అని పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వివిధ రకాల స్టంట్స్ చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా, డోనాల్డ్ ట్రంప్ నార్త్ కరోలినా లోని గ్రీన్స్ బొరలో ఎన్నికల ర్యాలీని నిర్వహించాడు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తనకి ఓట్లు వేసి గెలిపిస్తే అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తానని ఆయన మాట్లాడాడు. తను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే.. అమెరికాలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా అంతం చేస్తానని విపరీత చర్యలకు పాల్పడే వారిపై కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చాడు.
దేశంలోనే ప్రజలు తమ ఓటుతో కమలా హారిస్ ని ఇంటికి పంపించాలని, ఆమె ఓటమితోనే అమెరికా రక్షణ సాధ్యమవుతుందంటూ పేర్కొన్నారు. ముఖ్యంగా తాను అధికారంలోకి వస్తే.. ప్రజలపై ఉన్న పన్ను భారాన్ని తగ్గిస్తానని, అలాగే అమెరికన్ కంపెనీలను వెనక్కి తీసుకోవచ్చి అమెరికా ప్రజల జీతభత్యాలను పెంచేందుకు తాను సాయశక్తుల పనిచేస్తానని పేర్కొన్నారు. ఒకవేళ కమల హారిస్ అధికారంలోకి వస్తే.. అమెరికాలో అభివృద్ధి జరగదని, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమవుతుందని ఆయన విమర్శలు చేశారు. నవంబర్ ఐదున జరగబోతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి పలు ప్రాంతాల్లో ముందస్తు ఓటింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఇప్పటికే దాదాపు 6 కోట్లకుపైగా మంది ప్రజలు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.