Leading News Portal in Telugu

India alleges surveillance of officials in Canada


  • భారత్- కెనడా మధ్య రోజురోజుకు తీవ్రమవుతున్న దౌత్యపరమైన సంక్షోభం..

  • ఇండియన్ కాన్సులర్ సిబ్బందిపై ఒట్టావా నిఘా పెట్టిందని ఆరోపించిన భారత్..

  • మా కాన్సులర్ అధికారులను కెనడా సర్కార్ వేధింపులకు గురి చేస్తోంది: రణధీర్ జైస్వాల్
India- Canada Row: మా అధికారులపై కెనడా నిఘా పెట్టిందని ఆరోపించిన భారత్..

India- Canada Row: భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒట్టావా ఇండియన్ కాన్సులర్ సిబ్బందిపై నిఘా పెట్టిందని భాతర ప్రభుత్వం ఆరోపించింది. మా కాన్సులర్ అధికారులపై కెనడా ఆడియో, వీడియో రూపంలో నిఘా పెట్టిందని.. ఇలాంటి చర్యలకు పాల్పడి వారిని ‘వేధింపులకు గురి చేస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. అలాంటి చర్యలు స్థాపించడం కష్టతరం చేశాయని చెప్పుకొచ్చారు.

కాగా, ఈ చర్యలు సంబంధిత దౌత్య- కాన్సులర్ ఒప్పందాలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు తాముభావిస్తున్నాం.. కాబట్టి కెనడియన్ ప్రభుత్వానికి అధికారికంగా నిరసన తెలియజేస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పుకొచ్చారు. కెనడా ప్రభుత్వం బెదిరింపులకు దిగడాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టబోమన్నారు. మా దౌత్య- కాన్సులర్ సిబ్బంది ఇప్పటికే తీవ్రవాదం, హింసాత్మక వాతావరణంలో పని చేస్తున్నారని జైస్వాల్ ఆరోపించారు. సెప్టెంబరు 2023లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై దర్యాప్తులో ఒట్టావాలోని భారతీయ దౌత్యవేత్తలపై ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ప్రతిష్టంభన కొనసాగుతుంది.

ఇక, నిజ్జర్ హత్య కేసులో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో భారతీయ రాజబారుల ప్రమేయం ఉందని ఆరోపణలు చేశారు. దీనిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కెనడా ప్రభుత్వ ప్రకటన గత నెలలో ఒట్టావాలోని తన హైకమిషనర్‌తో పాటు ఇతర దౌత్యవేత్తలను వెనక్కి తీసుకొచ్చింది. అలాగే, కెనడా సర్కార్ ఆరుగురు దౌత్యవేత్తలను బహిష్కరించింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.