Leading News Portal in Telugu

Vijayasai Reddy Sensational Comments on Jamili Elections


  • 2027లోనే ఎన్నికలు రాబోతున్నాయి
  • ఎవరూ ఊహించని విధంగా వైసీపీ విజయం సాధిస్తుంది
  • ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
Vijayasai Reddy: 2027 ఆఖరిలో మళ్లీ ఎన్నికలు.. ఊహించని విజయం సాధిస్తాం..

Vijayasai Reddy: రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎవరూ ఊహించని విధంగా విజయం సాధిస్తుందని ఎంపీ విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2027లోనే ఎన్నికలు రాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని వర్గాల ప్రజలు అసంతృప్తికి గురి కావడంతో ఓటమి పాలయ్యామని అన్నారు. నేడు చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడిగా భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు అని విమర్శలు చేశారని.. భూమన టీటీడీ ఛైర్మన్‌గా ఎంతో కృషి చేశారన్నారు. కీలకమైన జిల్లాకు ఆయన అధ్యక్షుడిగా జగన్ నియమించారన్నారు. వచ్చే ఎన్నికలలో14 స్థానాలకు 14 స్దానాల్లో గెలిచేలా భూమన కృషి చేస్తారని చెప్పారు. మళ్ళీ 2027లో ఊహించని విజయం సాధిస్తామన్నారు. అందరినీ ఈసారి కలుపుకుని విజయం సాధిస్తామన్నారు.

జగన్‌ ఎన్నో చారిత్రాత్మక కార్యక్రమాలు చేశారని.. ఈ రోజు ప్రజలకు సంక్షేమం దూరం అయ్యిందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సిక్స్ ప్యాక్ హామీలు అని చెప్పి చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. దేవుడిను కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకున్నారని మండిపడ్డారు. విశాఖకు వెళ్లి రుషికొండ నిర్మాణాలను చూస్తున్నారన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 4 పోర్టులను నిర్మాణము చేస్తే ప్రవేట్ పరం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు మరింత గుర్తింపు ఇస్తామన్నారు. 2027 లోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయన్నారు. మళ్ళీ మన నాయకుడు జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని కార్యకర్తలకు సూచించారు. తిరుపతి నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత భూమనదేనని వ్యాఖ్యానించారు. ఆయనలో ఉన్న నాయకత్వ పటిమతో రాబోయే రోజుల్లో అన్ని స్థానాలు గెలిచి తీరుతామన్నారు.