Leading News Portal in Telugu

India suffer big blow in WTC table with 0-3 drubbing vs New Zealand


  • మరోసారి భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుందామనే ఆశలకు గండి..

  • డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయిన టీమిండియా..

  • ఆస్ట్రేలియాతో సిరీస్ గెలవకపోతే డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత్ వెళ్లడం కష్టమే..?
Team India – WTC: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయిన భారత్

Team India – WTC: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ ఓటమి టీమిండియా.. మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుందామనే ఆశలకు గండికొట్టేలా కనిపిస్తుంది. ఈ సిరీస్‌ ముందు వరకు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచిన టీమిండియా.. ఇప్పుడు 0-3 తేడాతో సిరీస్‌ను కోల్పోవడంతో సెకండ్ ప్లేస్ లోకి పడిపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 62.50 శాతంతో మొదటి స్థానానికి చేరుకుంది. భారత్ 58.33 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. శ్రీలంక (55.56) మూడో స్థానంలో కొనసాగుతుంది. భారత్‌పై టెస్టు సిరీస్‌ను గెలిచిన కివీస్ 54.55 శాతంతో నాలుగో ప్లేస్ కు చేరింది. ఆ తర్వాత సౌతాఫ్రికా54.17 శాతంతో 5వ స్థానంలో కొనసాగుతోంది.

అయితే, వరుసగా మూడు టెస్టుల్లో ఓడిపోవడంతో.. ఇతర జట్లూ ముందుకు దూసుకు రావడంతో టీమిండియాకు కఠిన సవాల్ ఎదురు అయ్యే అవకాశం ఉంది. బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆసీస్‌తో ఐదు టెస్టుల్లో పోటీ పడబోతుంది. WTC సైకిల్‌లో భారత్‌కు ఇదే లాస్ట్ సిరీస్‌. కనీసం 4 టెస్టుల్లో గెలిస్తే.. మరొక దానిని డ్రాగా ముగించాల్సి ఉంది.. ఒక్కటి ఓడినా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ అవకాశాలు మరింత క్లిష్టంగా మారిపోతాయి.