Leading News Portal in Telugu

Bhumana Karunakar Reddy said that he will work to make Jagan Anna CM.


  • చంద్రబాబు నాయుడుతో ఢీ కొట్టడం అంటే ఎప్పుడు సిద్ధమే- భూమన

  • నేను కార్యకర్తల మనిషిని- భూమన

  • ఒక నేతగా కాదు.. కార్యకర్తలకు అండగా నిలుస్తాను- భూమన

  • జగన్ అన్నను సీఎంగా చేసేందుకు పనిచేస్తా- భూమన కరుణాకర్ రెడ్డి.
Bhumana Karunakar Reddy: చంద్రబాబుతో ఢీ కొట్టడం అంటే ఎప్పుడు సిద్ధమే..

చంద్రబాబు నాయుడుతో ఢీ కొట్టడం అంటే ఎప్పుడు సిద్ధమేనని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. తాను కార్యకర్తల మనిషిని, కార్యకర్తల కోసమే నిలబడతానని అన్నారు. తాను గ్రూపులు కట్టడానికి రాలేదు.. ఒక నేతగా కాదు.. కార్యకర్తలకు అండగా నిలుస్తానన్నారు. నియోజకవర్గంలో ఇంఛార్జికి అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. వైఎస్.రాజారెడ్డి శిష్యుడిగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డితో నడిచిన వాడిని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పనిచేస్తున్న వాడినని భూమన పేర్కొన్నారు. అహంకారంతో పనిచేయను అని ప్రమాణం చేస్తున్నానన్నారు.

వైఎస్ఆర్ కుటుంబంతో 49 ఏళ్లుగా పనిచేస్తున్నా.. వయసు సడలుతున్నా మొక్కవోని ధైర్యంతో పనిచేస్తానని భూమన తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ సీఎంగా అయ్యేంత వరకు పని చేస్తానని పేర్కొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలు, సలహాలు, పాటిస్తూ మందుకు వెళ్తానని తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఈ సమావేశంకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దూరంగా ఉన్నారు.. ఆయన ఒక సందేశం పంపించారని చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యారాయణ సందేశంలను భూమన కరుణాకరరెడ్డి చదివి వినిపించారు. రాజకీయమే తనకు ఊపిరని.. తాను కార్యకర్తగా ఉంటాను, పార్టీ పటిష్ఠం వేగవంతం చేయడానికి పనిచేస్తానని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా చేసేందుకు పనిచేస్తానని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.