Leading News Portal in Telugu

Constable shot dead an SI with a service rifle in Manipur’s Jiribam district


  • వివాదం కారణంగా ఎస్సైతో కానిస్టేబుల్ వాగ్వాదం
  • సహనం కోల్పోయి ఎస్సైని కాల్చి చంపిన కానిస్టేబుల్
  • అక్కడికక్కడే మృతి చెందిన పోలీసు
  • నిందితుడిని అరెస్ట్ చేసిన మిగతా పోలీసులు
  • విచారణ ప్రారంభం
Constable who shot SI: సర్వీస్ రైఫిల్‌తో ఎస్సైని కాల్చి చంపిన కానిస్టేబుల్.. కారణం?

మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్ ఎస్సైని కాల్చి చంపిన ఉదంతం వెలుగు చూసింది. అధికారితో చిన్న వివాదం కారణంగా వాగ్వాదానికి దిగిన కానిస్టేబుల్ ఆవేశంతో తన సర్వీస్ రైఫిల్‌తో పాయింట్ బ్లాక్ రేంజ్‌లో ఎస్సైను కాల్చి చంపాడు. దీంతో కుర్చీలో కూర్చున్న ఎస్సై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాల్పులు జరిపిన కానిస్టేబుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

READ MORE: Omar Abdullah: ఉగ్రదాడిపై స్పందించిన జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్‌ 2 శనివారం రోజున ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిసింది. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన కానిస్టేబుల్‌.. ఎస్సైని కాల్చినట్టుగా చెప్పాడు. ఇంతకీ గొడవకు కారణమేమిటనేది పోలీసులు ఆరా తీస్తున్నారు.. నిందితుడు కానిస్టేబుల్‌ను డిపార్ట్‌ వెంటనే అరెస్టు చేశారు. అతడిని విచారిస్తున్నారు.

READ MORE:Delhi: ఘోరం.. ఇద్దరు ట్రాఫిక్ పోలీసులను ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్ (వీడియో)

ఈ ఘటనపై ఇంఫాల్‌లోని ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ప్రస్తుతం గట్టి భద్రతలో ఉన్న మోంగ్‌బంగ్ గ్రామ పోలీసు పోస్ట్ వద్ద ఈ సంఘటన జరిగిందని చెప్పారు. పోలీసు కానిస్టేబుల్ బిక్రమ్‌జీత్ సింగ్ కోపంతో తన సర్వీస్ రైఫిల్ తో సబ్-ఇన్‌స్పెక్టర్ షాజహాన్‌పై కాల్పులు జరిపాడని, ఆయన అక్కడికక్కడే మరణించాడని అధికారి తెలిపారు.