Leading News Portal in Telugu

Rishabh Pant deserves to be Rohit’s successor as Test captain: Mohammad Kaif


  • టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వారసుడిగా రిషబ్ పంత్‌ను ఎంచుకున్న కైఫ్

  • మంచి ఫామ్ లో ఉన్నాడన్న మహమ్మద్ కైఫ్

  • అతను ఎప్పుడు ఆడినా.. భారత జట్టును ముందు ఉంచుతాడు- కైఫ్

  • ఏ నంబర్ లో ఆడటానికి వచ్చినా.. మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడుతాడు- కైఫ్.
Team India: రోహిత్ శర్మ తర్వాత అతనికే కెప్టెన్సీ దక్కాలి.. ఇంతకీ ఎవరు..?

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.. ఈ సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లు ఎంతో నిరాశపరిచారు. దీంతో.. వారి ప్రదర్శనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నెలలో భారత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్‌లో కూడా విఫలమైతే.. బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోనుంది. ఈ క్రమంలో.. భారత కెప్టెన్ రోహిత్ శర్మపై కూడా చర్యలు తీసుకోనుంది. ఒకవేళ రోహిత్ శర్మ జట్టుకు దూరమైతే టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఈ క్రమంలో.. టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఓ పేరును సూచించాడు.

రిషబ్ పంత్ టెస్టు జట్టు కెప్టెన్సీకి సరైన వాడని మహ్మద్ కైఫ్ అన్నాడు. ప్రస్తుత జట్టులో కెప్టెన్సీ రేసులో ఉన్న ఏకైక ఆటగాడు పంత్ అని అతను అభిప్రాయపడ్డాడు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో కైఫ్ మాట్లాడుతూ, “ప్రస్తుత జట్టులో రిషబ్ పంత్ మాత్రమే టెస్ట్ కెప్టెన్ రేసులో ఉన్నాడు. అతను దానికి అర్హుడు.. అతను ఎప్పుడు ఆడినా, భారత జట్టును ముందు ఉంచాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలో పంత్ సెంచరీలు సాధించాడు. అతను ఏ నంబర్‌లో వచ్చి ఆడినా.. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతాడు’ అని కైఫ్ చెప్పాడు.

కైఫ్ మాట్లాడుతూ.. “రిషబ్ పంత్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడి.. లెజెండ్‌గా రిటైర్ అవుతాడు. ఇప్పటికే తన కీపింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. అతను క్రీజులో ఉన్నంత సేపు.. న్యూజిలాండ్ ఆటగాళ్లకు విశ్రాంతి లేకుండాపోయింది. ప్రస్తుత ఆటగాళ్లలో కెప్టెన్‌గా అయితే రిషబ్ పంత్ ఫస్ట్ ఆప్షన్. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో కెప్టెన్సీకి అర్హుడు.” అని చెప్పుకొచ్చాడు.