Leading News Portal in Telugu

CM Chandrababu approves New Sports Policy


  • దేశంలో ఉత్తమ స్పోర్ట్స్ పాలసీగా ఏపీ నూతన క్రీడా పాలసీ
  • నాలుగు లక్ష్యాలతో పాలసీ రూపకల్పన
  • ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం
  • నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం
AP Govt: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. నూతన క్రీడా పాలసీకి ఆమోదం

AP Govt: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నూతన క్రీడా విధానంపై సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దేశంలో ఉత్తమ స్పోర్ట్స్‌ పాలసీగా ఏపీ నూతన పాలసీ కావాలన్నారు. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు 4 లక్ష్యాలతో పాలసీ రూపకల్పన చేశామన్నారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్‌, ఏషియన్‌ గేమ్స్‌ విజేతలకు ఇచ్చే ప్రోత్సాహకం భారీగా పెంచారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తే ఇచ్చే ప్రోత్సాహకం రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు పీపీపీ విధానంలో స్టేడియాలు, సంస్థల సహకారంతో క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై చర్చించారు. ఇందులో ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్‌లో పతకాలు పొందే వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచాలని ప్రతిపాదించారు.