Leading News Portal in Telugu

Police Passing Out Parade in Ananthapuram


  • అనంతపురంలో రేపు ‘డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్’
  • ముఖ్య అతిథిగా హాజరవుతోన్న హోంమంత్రి అనిత
Passing Out Parade: అనంతపురంలో రేపు ‘డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్’

Passing Out Parade: మంగళవారం అనంతపురం జిల్లాలో డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవడం కోసం హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే అనంతపురం నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనితకు అనంతపురం పట్టణ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, టూ మేన్ కమిటీ సభ్యుడు ఆలం నరసనాయుడు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ జగదీష్ హోంమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.