Leading News Portal in Telugu

CM Revanth Reddy Advocates for Major Education Reforms in Telangana


  • గత పదేళ్లలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైంది
  • ప్రజా ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తుంది
  • విద్యార్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ..
CM Revanth Reddy : గత పదేళ్లలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైంది

CM Revanth Reddy : గత పదేళ్లలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని, ప్రజా ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తుందన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. విద్యార్థులతో సీఎం ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామన్నారు. త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. యువజన సంఘాలు బడి బయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించేలా చొరవ చూపాలని, స్కూల్స్, కాలేజీల్లో డ్రాపవుట్స్ తగ్గించాలన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

RK Roja: హోంమంత్రి రాజీనామా చేయాలి.. పవన్‌ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి రోజా

ఇది యువతరంపై ఉన్న అతి పెద్ద బాధ్యత… యువత విద్యను నిర్లక్ష్యం చేయొద్దని, గంజాయి, డ్రగ్స్ అన్నింటికంటే పెద్ద ప్రమాదకరం.. అలాంటి వ్యసనాల బారిన పడొద్దని ఆయన అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దంకండని ఆయన అన్నారు. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దని, విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమేనన్నారు. చదువుకున్న వారు ప్రయోజకులు అవుతారని, సామాజిక స్పృహతో సమాజానికి సేవచేసే వారు మాజంలో హీరోలు అవుతారని, పాఠశాలల్లో విద్యతో పాటు సామాజిక అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు గ్రూప్ డిస్కషన్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఉన్నత చదువులు చదువుకుని… తెలంగాణ పునర్నిర్మాణంలో మీరంతా భాగస్వాములు కావాలన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Minister Nadendla Manohar: బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు సహకరించాలి..