Leading News Portal in Telugu

Anushka Shetty Krish Jagarlamudi Crazy Project Titled Ghaati


Ghaati: క్రిష్- అనుష్క శెట్టి ‘ఘాటి’!

క్వీన్ అనుష్క శెట్టి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో క్రేజీ హై బడ్జెట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొంది, కమర్షియల్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్‌ కాంబినేషన్ లో ఇది రెండవ ప్రాజెక్ట్. ఈ హై బడ్జెట్ వెంచర్‌కి ‘ఘాటి’ అనే టైటిల్‌ని లాక్ చేశారు.

Jabardasth: వేణుమాధవ్‌తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడు జబర్దస్త్ స్టార్ కమెడియన్!

ఈ సినిమా షూటింగ్ కేవలం మూడు రోజుల్లో కోఇన్సిడెంట్ గా అనుష్క పుట్టినరోజుతో పూర్తవుతుందట. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, మేకర్స్ రెండు ముఖ్యమైన అప్‌డేట్‌లను అందిస్తున్నారు-మూవీ ఫస్ట్ లుక్, ఎ స్పెషల్ గ్లింప్స్ ఇన్‌టు ది వరల్డ్ ని రిలీజ్ చేస్తున్నారు. టైటిల్ పోస్టర్‌లో ట్రెక్కర్లు ఘాట్‌లను నావిగేట్ చేసే బ్రెత్ టేకింగ్ సీన్ ఆడియన్స్ ని కట్టిపడేసింది. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను కూడా ఆ రోజు వెల్లడించనున్నారు.